2025.. స్నేక్‌ ఇయర్‌ అని మీకు తెలుసా ?? పాముకు 2025కు సంబంధమేంటి ??

|

Jan 06, 2025 | 6:04 PM

కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. కొంగొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకొచ్చింది. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా .. బీటా బేబీస్‌గా పిలువనున్నారు. వీరు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటారని నిపుణులు భావిస్తున్నారు.

ఈ విషయాన్ని కాస్త పక్కనబెడితే చైనీయులకి న్యూ ఇయర్‌ జనవరి 1వ తేదీన కాకుండా జనవరి మూడో వారం మొదలవుతుంది. వారి క్యాలెండర్‌ ప్రకారం 2025.. ఇయర్‌ ఆఫ్‌ స్నేక్‌. అంటే సర్పానికి చెందిన సంవత్సరం అని అర్థం. 2 వేల ఏళ్ల నాటి చైనీయుల పురాణాల ప్రకారం 12 సంవత్సరాలకి 12 జంతువుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అవి ఇయర్‌ ఆఫ్ ఎలుక, ఇయర్‌ ఆఫ్‌ ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడి, కుక్క, పంది ఇలా అన్నమాట. మరో 12 ఏళ్లు 12 జంతువుల పేర్లు పునరావృతమవుతాయి. 2025 ఏడాది ఆరవ జంతువైన పాముకు చెందినదిగా చైనీయుల రాశిచక్రం చెబుతోంది. సర్పజాతికి చెందిన పాములో ఉన్న సహజ గుణాల తీరులో ప్రపంచ గమనం ఉండబోతోందని చైనా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ఆసక్తికర ప్రిడిక్షన్స్‌ ఏంటో చూసేద్దాం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: 2024లో రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??

రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు