బస్సు కింద నలిగిపోతున్నా ఎవరూ చలించలేదు..తమ్ముడి కోసం అక్క ఆవేదన

|

Apr 15, 2024 | 6:47 PM

నా పన్నెండేళ్ల తమ్ముడు నెల రోజులు ఉపవాసాలు చేశాడు. దర్గాకు పెళ్ళి కార్డుతో బయలుదేరాం. రోడ్డుపై టిఫిన్ కోసం ఆగాం. మరో నిమిషంలో తిరిగి బయలుదేరబోతున్నాం. ఇంతలో మృత్యుశకటంలా దూసుకువచ్చింది బస్సు. బస్సు చక్రాల కింద నలిగిపోతున్న నా తమ్ముడ్ని రక్షించాలని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు.. చిన్నారి తమ్ముడికోసం ఓ అక్క పడిన ఆవేదన.. తన పెళ్లి సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు కోసం వెళ్తే తన తమ్ముడినే కోల్పోయానంటూ ఆ యువతి బోరున విలపించిన తీరు అందరిని కలచి వేసింది.

నా పన్నెండేళ్ల తమ్ముడు నెల రోజులు ఉపవాసాలు చేశాడు. దర్గాకు పెళ్ళి కార్డుతో బయలుదేరాం. రోడ్డుపై టిఫిన్ కోసం ఆగాం. మరో నిమిషంలో తిరిగి బయలుదేరబోతున్నాం. ఇంతలో మృత్యుశకటంలా దూసుకువచ్చింది బస్సు. బస్సు చక్రాల కింద నలిగిపోతున్న నా తమ్ముడ్ని రక్షించాలని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు.. చిన్నారి తమ్ముడికోసం ఓ అక్క పడిన ఆవేదన.. తన పెళ్లి సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు కోసం వెళ్తే తన తమ్ముడినే కోల్పోయానంటూ ఆ యువతి బోరున విలపించిన తీరు అందరిని కలచి వేసింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ద్రోణంరాజు నగర్‌కు చెందిన షేక్‌ రెహమాన్‌ కుటుంబం ఇంట్లో శుభకార్యానికి సిద్ధమవుతున్నారు. రంజాన్ సందర్భంగా కుటుంబం అంతా నెలరోజుల పాటు భక్తితో ఉపవాసాలు చేశారు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా పండుగ జరుపుకున్నారు. మరికొన్ని రోజుల్లో కుమార్తె వివాహం.. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. అతిథులు, బంధుమిత్రులకు వాటిని పంచే ముందు తమకు నమ్మకమైన దర్గాల సందర్శనకు కుటుంబ సభ్యులంతా కలిసి కారులో పిఠాపురం బయలుదేరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోర్నవిటా అస్సలు హెల్త్ డ్రింకే కాదు… స్పష్టం చేసిన కేంద్రం