వందే భారత్ మిషన్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా దుబాయిలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి

వందే భారత్ మిషన్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 8:14 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా దుబాయిలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న ఎయిర్ ఇండియా విమానం కేరళలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మిషన్‌ను కొనసాగిస్తుందో.. లేదో.. అని విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘వందే భారత్ మిషన్’ను యథావిధిగా కొనసాగించనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉంటే.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 9.5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు.

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!