కార్లపై బిస్కెట్లను ఉడికించడం ఎలా.? అమెరికా ఎండల్లో ‘వినూత్న ప్రయోగం’

కార్లను మండుతున్న ఎండల్లో గంటల తరబడి పార్క్ చేస్తే.. అవి కాస్తా ఆ వేడికి డూప్లికేట్ అయస్కాంతాలుగా మారతాయన్న సరదా నానుడి ఒకటి ఉంది. దీనిని నిరూపించడానికా అన్నట్లు.. అమెరికాలోని జాతీయ వాతావరణ శాఖ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కొన్ని పచ్చి బిస్కెట్లను తీసుకుని ఓ ట్రేలో పెట్టి.. ఎండలో ఉంచిన వాహనంలో అమర్చారు అధికారులు. అంటే దాదాపు 45 నిమిషాల తర్వాత చూస్తే ఏముంది.. మామూలు స్టవ్‌ల మీద ఉడికినట్లే ఉడకడం ప్రారంభించాయి. అలా […]

కార్లపై బిస్కెట్లను ఉడికించడం ఎలా.? అమెరికా ఎండల్లో 'వినూత్న ప్రయోగం'
Follow us

|

Updated on: Jul 22, 2019 | 5:50 PM

కార్లను మండుతున్న ఎండల్లో గంటల తరబడి పార్క్ చేస్తే.. అవి కాస్తా ఆ వేడికి డూప్లికేట్ అయస్కాంతాలుగా మారతాయన్న సరదా నానుడి ఒకటి ఉంది. దీనిని నిరూపించడానికా అన్నట్లు.. అమెరికాలోని జాతీయ వాతావరణ శాఖ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కొన్ని పచ్చి బిస్కెట్లను తీసుకుని ఓ ట్రేలో పెట్టి.. ఎండలో ఉంచిన వాహనంలో అమర్చారు అధికారులు. అంటే దాదాపు 45 నిమిషాల తర్వాత చూస్తే ఏముంది.. మామూలు స్టవ్‌ల మీద ఉడికినట్లే ఉడకడం ప్రారంభించాయి.

అలా 8 గంటలు ముగిసిన తర్వాత అవి పూర్తిగా కాలిన రంగులోకి మారాయి. దేశంలో ఎండ తీవ్రత ఇంత తీవ్రంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం యూఎస్‌లో ఎండలు 42 డిగ్రీలుపైగానే నమోదవుతున్నాయని తెలుస్తోంది. సాధారణంగా అమెరికాలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. చల్లటి వాతావరణం సహజం. అయితే ఈసారి మాత్రం అక్కడ ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బిస్కెట్లను వేడెక్కిన కార్ల మీద పెట్టి ఉడికించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Latest Articles