కేరళ అడవుల్లో ‘సైరా’ పోరాటాలు

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ చిత్ర షూటింగ్ జోరుగా జరుగుతుంది. అప్పటి వాతావరణాన్ని రీ క్రియేట్ చేయాల్సి రావడంతో షూటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం కేరళ అడవుల్లో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పది రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మరికొన్ని కీలక సన్నివేశాలు, ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేస్తారట. దాంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బ్రిటిష్‌వారితో […]

కేరళ అడవుల్లో ‘సైరా’ పోరాటాలు
Follow us

|

Updated on: Apr 16, 2019 | 7:49 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ చిత్ర షూటింగ్ జోరుగా జరుగుతుంది. అప్పటి వాతావరణాన్ని రీ క్రియేట్ చేయాల్సి రావడంతో షూటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం కేరళ అడవుల్లో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పది రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మరికొన్ని కీలక సన్నివేశాలు, ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేస్తారట. దాంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బ్రిటిష్‌వారితో నరసింహారెడ్డి ఎలా పోరాటం చేశాడు? తెల్లదొరల వెన్నులో ఎలా వణుకు పుట్టించాడన్న నేపథ్యంలో కథ ఉంటుంది. మూవీలో పోరాట సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉండటంతో.. మూవీ యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వీటికోసమే  బడ్జెట్‌లో 25 శాతం కేటాయించారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  మే నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కానున్నాయి. అతి త్వరలో రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేయనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, జగపతిబాబు, కిచ్చా సుదీప్‌, విజయ్‌సేతుపతి మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.