ఆ యాప్‌తో 104 డిపార్ట్‌మెంట్లకు చెందిన 600 సేవలు!

భారత ప్రభుత్వం ఉమాంగ్ యాప్‌ను ప్రారంభించి రెండేళ్లకు పైగా అయింది. డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న

ఆ యాప్‌తో 104 డిపార్ట్‌మెంట్లకు చెందిన 600 సేవలు!
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 8:42 PM

UMANG: భారత ప్రభుత్వం ఉమాంగ్ యాప్‌ను ప్రారంభించి రెండేళ్లకు పైగా అయింది. డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్స్, ఆధార్, పాన్ కార్డు, గ్యాస్ బుకింగ్, పాస్‌పోర్ట్ ఇలా ఎన్నో రకాల సేవలు పొందొచ్చు.

అయితే.. ఉమాంగ్ యాప్ ద్వారా యూజర్లు 104 డిపార్ట్‌మెంట్లకు చెందిన దాదాపు 600 సేవలు పొందొచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్ మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్లోర్‌కు వెళ్లి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఈగవర్నెన్స్ డివిజన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి.

కాగా.. ఈ యాప్ ద్వారా పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సేవలు, ఆధార్ సేవలు, భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్‌ను బుక్ చేసుకోవచ్చు. సీబీఎస్‌ఈ రిజల్ట్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగులు వారి పీఎఫ్ ఖాతా వివరాలు కూడా చూసుకోవచ్చు. నేరుగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అలాగే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆదాయపు పన్ను చెల్లించొచ్చు. పాన్ కార్డు కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అలాగే పాన్ కార్డు స్టేటస్ చూసుకోవచ్చు.

మరోవైపు.. మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలని భావిస్తే.. మీరు ఈ యాప్ ద్వారా పలు సర్వీసులు పొందొచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ (అర్బన్) (పీఎంఏవై) స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ, స్టేటస్ చెక్, సబ్సిడీ క్యాలిక్యులేటర్ వంటి సేవులు ఎన్నో పొందొచ్చు. పెన్షనర్లకు కూడా ఈ యాప్ ఉపయోపడుతుంది.

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం