Breaking: ఇకపై ప్రత్యక్ష ప్రసారం కానున్న టీటీడీ బోర్డు సమావేశాలు

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్‌ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

Breaking: ఇకపై ప్రత్యక్ష ప్రసారం కానున్న టీటీడీ బోర్డు సమావేశాలు
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 1:38 PM

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్‌ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇకపై టీటీడీలో జరిగే అన్ని బోర్డు మీటింగ్‌లను అసెంబ్లీ సమావేశాల మాదిరి ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. బోర్డు మీటింగ్‌లో జరిగే చర్చ అంతా పారదర్శకంగా ప్రజలందరికీ తెలియాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగులందరికీ స్వాబ్ టెస్టులు చేయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమలలో ఎలాంటి ప్రత్యేక సేవ కార్యక్రమాలు చేయాలని అనుకోవడం లేదని అన్నారు. ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం ఎలా చేయొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం తేదీ వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే తిరుమల కొండపై కర్ణాటక సత్రం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకున్నామని.. ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మాణాల కోసం రెండువందల కోట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కర్ణాటక సీఎం యడ్యూరప్పతో శుక్రవారం బెంగళూరులో భేటీ అయినట్లు వివరించారు.

ఏపీ సీఎం జగన్‌తో కలిసి, కర్ణాటక సీఎం యడ్యూరప్ప కర్ణాటక సత్ర నిర్మాణం ప్రారంభించనున్నారని తెలిపారు. ఇక కొండపై ప్రైవేట్ గెస్ట్ హౌజుల కేటాయింపు విషయంలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని..  సీఎం జగన్ ఆదేశాలతో గెస్ట్ హౌజులు కేటాయింపుపై ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ సిస్టమ్ పెడుతున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎవరు ఎక్కువ స్వామి వారికి విరాళం ఇస్తారో వారికి ప్రైవేట్‌ గెస్ట్ హౌజులు కేటాయించనున్నట్లు టీటీడీ చైర్మన్ వివరించారు.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..