ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. డిపోల వద్ద టెన్షన్ టెన్షన్

తెలంగాణలో 52 రోజుల పాటు కొనసాగించిన సమ్మెను విరమించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విధుల్లోకి చేరేందుకు ఈ ఉదయం 5గంటల నుంచే కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. అయితే కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం అసాధ్యమని స్పష్టం చేసిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. డిపోల దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు లోపలికి అనుమతించిండం లేదు. మరికొన్ని ప్రదేశాల్లో తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు, […]

ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. డిపోల వద్ద టెన్షన్ టెన్షన్
Follow us

| Edited By:

Updated on: Nov 26, 2019 | 8:06 AM

తెలంగాణలో 52 రోజుల పాటు కొనసాగించిన సమ్మెను విరమించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విధుల్లోకి చేరేందుకు ఈ ఉదయం 5గంటల నుంచే కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. అయితే కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం అసాధ్యమని స్పష్టం చేసిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. డిపోల దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు లోపలికి అనుమతించిండం లేదు. మరికొన్ని ప్రదేశాల్లో తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్‌లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు అదుపుతప్పేలా ఉండటంతో.. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

మరోవైపు సికింద్రాబాద్‌ జేబీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రైవేట్ కార్మికుల విధులకు ఆటంకాలు కలగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. జేబీఎస్‌కు వచ్చే రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆర్టీసీ కార్మికులను డిపోల్లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.

ఇదిలా ఉంటే సమ్మె విరమించినా, విధుల్లోకి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె విరమణపై డిపో మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చినా.. కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. డిపోలకు కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్మికులను అరెస్ట్ చేస్తున్నారని.. సమ్మె చేయాలన్నా, విరమించాలన్నా ఎండీ అనుమతి అవసరం లేదని రాజిరెడ్డి చెబుతున్నారు. కాగా ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులు సమ్మెను విరమించకపోవడంతో 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..