Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కి ఏమైంది ?

trinamul congress mp nusrat jahan hospitalised, తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కి ఏమైంది ?

పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ అస్వస్థతకు గురయ్యారు. కోల్ కతా లోని ప్రయివేటు ఆసుపత్రిలో ఆమెను ఆదివారం రాత్రి అడ్మిట్ చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన కారణంగా నుస్రత్ ను ఆస్పత్రిలో చేర్పించామని వారు పేర్కొన్నారు. . ఆదివారం తన భర్త, బిజినెస్ మన్ అయిన నిఖిల్ జైన్ బర్త్ డే కావడంతో అందుకు సంబంధించి జరిగిన సెలబ్రేషన్స్ తాలూకు ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది కూడా. అయితే ఆ తరువాత హఠాత్తుగా శ్వాస తీసుకోలేకపోయిందట. ఏమైనా.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్ఛునని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బసీర్హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నుస్రత్ మూడున్నర లక్షల ఓట్లతో విజయం సాధించిన సంగతి విదితమే.. ముస్లిం అయినప్పటికీ హిందూ సంప్రదాయాలను పాటిస్తున్న ఆమెపై పలు ముస్లిం సంఘాలు మండిపడినప్పటికీ, ఆ సంఘాలకు, మత గురువులకు ఆమె దీటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.