అక్క అత్తారింటికి వెళ్లిన చెల్లి.. అనుకోకుండా మొదలైన ప్రేమ కహానీ! చివరికి ఏమైందంటే..?

వందన అనే యువతి తన సోదరి మరిదితో ప్రేమలో పడి పారిపోయి వివాహం చేసుకుంది. వారి కుటుంబాలు వారి సంబంధానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు వందన కుటుంబం ఆమెను, ఆమె భర్తను, అత్తమామలను చంపేస్తామని బెదిరిస్తోంది. భయంతో వందన సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసి రక్షణ కోరుతోంది.

అక్క అత్తారింటికి వెళ్లిన చెల్లి.. అనుకోకుండా మొదలైన ప్రేమ కహానీ! చివరికి ఏమైందంటే..?
Vandana And Karan

Updated on: Sep 17, 2025 | 6:35 AM

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కోలారస్ తహసీల్‌లోని పిరోంత్ గ్రామానికి చెందిన ఒక యువతి తన సొంత సోదరి మరిదితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబం సభ్యులకు చెప్తే.. వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి, అబ్బాయి ఇంటి నుండి పారిపోయి అఫిడవిట్ ద్వారా వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి కుటుంబం ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆమె భర్తను, అత్తమామలను చంపేస్తామని బెదిరిస్తోంది. భయపడిన ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. తనకు తన భర్తకు, తన అత్తమామలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది.

పిరోంత్ నివాసి అయిన జగదీష్ కుష్వాహా కుమార్తె వందన వయసు 20 సంవత్సరాలు. ఆమె తన సోదరి అత్ఘారింటికి తరచుగా వెళ్లేది. ఈ సమయంలో ఆమె తన సోదరి మరిది, సర్జాపూర్ కోలారస్ నివాసి అయిన జోఖురామ్ కుష్వాహా కుమారుడు కరణ్ (23 సంవత్సరాలు)తో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వారి కుటుంబాలకు తమ ప్రేమ విషయం చెప్పగా, వాళ్లు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఎంతగా ఒప్పించినా, వందన కుటుంబం ఆ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆ ఇద్దరు ప్రేమికులకు వేరే మార్గం లేకుండా పోయింది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 10న ఇద్దరూ పారిపోయారు. వందన, కరణ్ పారిపోయినప్పుడు, వందన కుటుంబం కరణ్ ఇంటికి చేరుకుని, కరణ్ కుటుంబంతో పాటు వందన, కరణ్‌ను చంపేస్తామని బెదిరించింది.

తన కుటుంబం వల్ల ఇబ్బంది పడుతున్న వందన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తామిరిద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని, కానీ తన కుటుంబ సభ్యులు తన అత్తమామలను కొడుతున్నారని, వారిద్దరూ కూడా ప్రమాదంలో ఉన్నారని ఆమె చెప్పింది. వందన కరణ్‌తో ఒక వీడియో చేసి షేర్ చేసినప్పుడు, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో వందన తన కుటుంబ సభ్యులు తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే, దానిని నమోదు చేయవద్దని పోలీసులను అభ్యర్థించింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి