Golden Temple: ‘ఇది పంజాబ్, ఇండియా కాదు’.. గోల్డెన్ టెంపుల్‌ లోకి అమ్మాయిని వెళ్లకుండా అడ్డుకున్నారు

పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ చాలా ఫేమస్. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతిరోజు భారీగా పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ఆలయంలోకి ఓ అమ్మాయిని పంపకుండా అడ్డుకోవడం కలకలం రేపుతోంది.

Golden Temple: ఇది పంజాబ్, ఇండియా కాదు.. గోల్డెన్ టెంపుల్‌ లోకి అమ్మాయిని వెళ్లకుండా అడ్డుకున్నారు
Golden Temple

Updated on: Apr 17, 2023 | 12:54 PM

పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ చాలా ఫేమస్. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతిరోజు భారీగా పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ఆలయంలోకి ఓ అమ్మాయిని పంపకుండా అడ్డుకోవడం కలకలం రేపుతోంది. అమృత్‌సర్ లో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ కి ఓ అమ్మాయి తన చెంపలకు మూడు రంగుల జెండా పేయింటింగ్‌ను వేసుకొని వచ్చింది. ఆ ఆలయ ప్రవేశం వద్ద ఉన్న ఓ వ్యక్తి ఆమెను ఆపాడు. తన చెంపకు ఉన్న రంగులేంటని అడగగా అది భారతీయ జెండా రంగులని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి ఇది పంజాబ్ అని..ఇండియా కాదని ఆమెతో చెప్పాడు. ఆమె ఆలయం లోపలికి వెళ్తానన్నప్పటికీ అతను అనుమతించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నెటిజన్లు దీని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై జనరల్ సెక్రటరీ ఆఫ్ షిరోమణి గురుద్వార పర్బందక్ కమిటీ (SGCP) స్పందించింది. ఇది సిక్కుల పవిత్ర స్థలమని.. ప్రతి మతపరమైన స్థలానికి దాని సొంత విధానాన్ని కలిగి ఉంటుందని SGCP జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్ గ్రేవల్ అన్నారు . ఆలయంలోకి ప్రతి ఒక్కరిని మేము స్వాగతిస్తామని.. ఏ అధికారైనా అసభ్యంగా ప్రవర్తించినట్లైతే అందుకు తాము క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయిపై ఉన్న రంగులపై అశోక చక్రం లేదని..అది భారత జాతీయ జెండా కాదని స్పష్టం చేశారు. అది రాజకీయ జెండా కావచ్చేమోనని వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us