Viral Video: ఓ మై గాడ్.! అక్కా భయమేస్తుందే.. భారీ అనకొండలతో సయ్యాటలు.. వీడియో చూస్తే షాకే..

|

May 13, 2024 | 10:31 AM

ఈ కాలంలో చాలామంది యువతులు ఇంట్లో బొద్దింకను చూసినా.. లేదా బల్లిని చూసినా.. అరుస్తూ, కేకలు వేస్తూ భయపడుతుంటారు. ఇలాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ప్రతీ అమ్మాయి ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందరో మహిళలు తమ ధైర్యసాహసాలకు చూపించిన సందర్భాలు లేకపోలేదు.

Viral Video: ఓ మై గాడ్.! అక్కా భయమేస్తుందే.. భారీ అనకొండలతో సయ్యాటలు.. వీడియో చూస్తే షాకే..
Viral Video
Follow us on

ఈ కాలంలో చాలామంది యువతులు ఇంట్లో బొద్దింకను చూసినా.. లేదా బల్లిని చూసినా.. అరుస్తూ, కేకలు వేస్తూ భయపడుతుంటారు. ఇలాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ప్రతీ అమ్మాయి ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందరో మహిళలు తమ ధైర్యసాహసాలకు చూపించిన సందర్భాలు లేకపోలేదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే.. మీరంతా షాక్ కావడం ఖాయం. అక్కా.! ఏంటీ నీకు ఆ ధైర్యం అంటూ.. పొగడ్తల వర్షం కూడా కురిపిస్తారు. జే బ్రూవర్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలో రెప్తిల్ జూ.. అలాగే సరీసృపాల కంటూ కూడా ప్రత్యేకంగా ఓ జూ నడుపుతున్నాడు. పాములు, చిరుతలు, కొండచిలువలు, తెల్ల మొసళ్లు, ఏనుగులు, తాబేళ్లు, అనకొండలు.. ఇలా ఒకటేమిటి.. అతడు నడిపే జూలో అనేక ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి. ఇక జే బ్రూవర్‌తో పాటు అతడి కూతురు జూలియట్ బ్రూవర్ కూడా ఆ జూను అప్పుడప్పుడూ చూస్తుంటుంది. అలాగే అందులోని సరీసృపాలతో మచ్చికలాడుతుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జూలియట్ బ్రూవర్ సుమారు 27 అనకొండలు.. అవి ఆషామాషీగా లేవండీ.. ఏకంగా 20 అడుగుల భారీ సైజు ఉన్నాయి. వాటితో ఈ యువతి పెంపుడు జంతువుల మాదిరిగా ఆలనాపాలనా చూడటం మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు మాత్రం దెబ్బకు జనాలు ఉలిక్కిపడుతున్నారు. నిజానికి మిస్ బ్రూవర్‌ కొండచిలువలు ఆడుతున్న తీరు.. ప్రతీ ఒక్కరికి సాధ్యం కాదు. గుండెల్లో ఎంతో ధైర్యం ఉంటేనే గానీ అలా ఎవ్వరూ చేయలేరు. ఆమె కొండచిలువలతో ఆడుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దీనిపై ఓ లుక్కేసేయండి.