సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇన్‌స్టా, ట్విట్టర్ అని.. ప్రతీ సోషల్ మీడియా అకౌంట్లలోనూ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వివిధ రకాల స్టంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో యువత అయితే లైకులు, వ్యూస్, ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రాణాలకు తెగించి మరీ రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. అయితే స్టంట్స్ అనేవి పిల్లల ఆట కాదు.. చాలా రిస్క్‌తో కూడుకున్నవి. దానికోసం చాలా ప్రాక్టీస్ ఉండాల్సిందే. ఇటీవల ఓ యువతి చేసిన స్టంట్ చూసి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ చూసేయండి.
స్కూటీ వెనుక సీటుపై ఎర్ర చీర కట్టుకున్న ఓ అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. తడుముకోకుండా వెంటనే ఓ బ్యాక్‌ఫ్లిప్ చేసి.. కూల్‌గా నేలపై నిలబడుతుంది. రివర్స్‌లో ఆమె చేసిన స్టంట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. కాగా, ఈ వీడియోను ‘shalugymnast’ అనే ఇన్‌స్టా యూజర్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ యువతి స్టంట్ చూసిన నెటిజన్లు.. అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయ్.