Viral Video: ఛీ.. ఛీ ఇదేం పాడుబుద్ది.. సూపర్‌మార్కెట్‌‌లో చిప్స్ ప్యాకెట్స్‌లో ఉమ్మి వేసి..

కొన్ని వీడియోలు చూస్తే కోపం వస్తుంది. మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఇంత అసహ్యకరమైన వీడియోలు మన కంట పడ్డందుకు బాధపడతాం కూడా.

Viral Video: ఛీ.. ఛీ ఇదేం పాడుబుద్ది.. సూపర్‌మార్కెట్‌‌లో చిప్స్ ప్యాకెట్స్‌లో ఉమ్మి వేసి..
Viral Video

Updated on: Dec 09, 2021 | 8:33 PM

సోషల్ మీడియాలో  కొన్ని వీడియోలు చూస్తే కోపం వస్తుంది. మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఇంత అసహ్యకరమైన వీడియోలు మన కంట పడ్డందుకు బాధపడతాం కూడా. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.  సూపర్‌మార్కెట్‌కు వచ్చిన ఒక మహిళ.. తన నీచమైన పనితో నెటిజన్ల చేత తిట్లు తింది. సూపర్ మార్కెట్‌లోని అల్మారాల్లో పెట్టే పలు రకాలు ఫుడ్  ప్యాకెట్లను ఓపెన్ చేసి.. టేస్ట్ చేసింది. అవి నచ్చకపోతే తిరిగి ప్యాకెట్లలోనే ఉమ్మివేసి.. మళ్లీ సీల్ వేసింది. సూపర్ మార్కెట్ అంతటా తిరుగుతూ ఆమె ఇదే తంతు కొనసాగించింది. అయితే సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఓ వ్యక్తి.. ఈమె చేష్టలను గమనించి వీడియో తీశాడు.  సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా.. వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి

ఈ వీడియో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో  వైరల్ అయ్యింది. కానీ నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వాటిని వెంటనే తొలగించారు. అయినప్పటికీ, కొన్ని కాపీలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదకర కరోనా గురించి అందరూ భయపడుతోన్న సమయంలో ఇలా ప్రవర్తించిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈమె పనిని గమనించి వీడియో తీసిన వ్యక్తి.. ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ‘నేను ఇక్కడికి సామాగ్రి కోసం వచ్చాను..  దొంగిలించడానికి కాదు.. నీ పని నువ్వు చూసుకో ఇది నీ వ్యాపారం కాదు’ అని ఆ లేడీ కామెంట్ చేసింది. అతడు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుంచి తుర్రమంది. అయితే ఇది కావాలని తీసిన వీడియో అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే… ట్రై చేయండి

“ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?” అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే

Loading...
Unable to load recommendations.
Follow Us