Viral: రైల్వే ట్రాక్‌పై కనిపించిన మహిళ మృతదేహం.. ఆమె అరచేతిని చూడగా పోలీసులు షాక్!

|

Jul 07, 2022 | 9:35 PM

అక్కడున్న స్థానికులకు రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు..

Viral: రైల్వే ట్రాక్‌పై కనిపించిన మహిళ మృతదేహం.. ఆమె అరచేతిని చూడగా పోలీసులు షాక్!
Railway Track
Follow us on

అక్కడున్న స్థానికులకు రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారు స్పాట్‌కు వచ్చి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆమె అరచేతిలో కొన్ని అక్షరాలు లీలగా కనిపించాయి. అవి ఏమయ్యాయి ఉంటాయని చూడగా.. దెబ్బకు ఫ్యూజులు ఔట్..

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ఇనర్వ గోత్ గ్రామంలో మనోజ్ పాశ్వాన్, కుమారి దంపతులు నివాసముంటున్నారు. వీరికి 2012లో వివాహమైంది. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు గానీ.. రెండు రోజుల కిందట రైల్వే ట్రాక్‌పై కుమారి శవమై కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆమె అరచేతిలో కొన్ని అక్షరాలు లీలగా కనిపించాయి. వాటిని సరిగ్గా చూడగా పోలీసులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

‘నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నేను పోతే ఎవ్వరికీ ఎలాంటి సమస్య ఉండదు’ అని తన పేరు, చిరునామా పెన్నుతో అరచేతిలో రాసుకుంది కుమారి. ఆమె దగ్గర లభ్యమైన సమాచారం మేరకు కుమారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హత్యా.? ఆత్మహత్యా.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.