వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన వరుళ్ళు!

ఈ రోజుల్లో జీవిత భాగస్వామిని వెతుక్కోవడం పెద్ద సవాలుగా మారింది. దానికి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, డేటింగ్ యాప్‌లు లేదా బంధువుల సిఫార్సులు వాడుతుంటారు. అయితే, ఒక యువతి మాత్రం వీటిన్నింటికీ భిన్నంగా డిజిటల్ టెక్నాలజీని వినూత్నంగా వాడుకుంది. తనకు కాబోయే భర్తను ఎంచుకోవడానికి ఏకంగా ఒక గూగుల్ ఫామ్ తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వినూత్న ఐడియా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున స్పందనను రాబట్టింది.

వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన వరుళ్ళు!
Google Form To Find Husband

Updated on: Oct 08, 2026 | 9:58 PM

వరుడి కోసం మ్యాట్రిమోనీ యాప్‌లు, బ్రోకర్ల చుట్టూ తిరగడానికి విసిగిపోయిన ఒక యువతి వినూత్నంగా ఆలోచించి గూగుల్ ఫామ్ క్రియేట్ చేసింది. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ ఫామ్ లింక్‌ను షేర్ చేసింది. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా, ఊహించని రీతిలో ఏకంగా 240 మందికి పైగా యువకుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. సాంప్రదాయ వివాహ ప్రక్రియలకు భిన్నంగా గూగుల్ ఫామ్ ద్వారా తనకు సరిపోయే జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఆమె చేసిన ఈ ప్రయత్నంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆ గూగుల్ ఫామ్‌లో ఏముంది?

సదరు యువతి క్రియేట్ చేసిన గూగుల్ ఫామ్‌లో సాధారణ బయోడేటాతో పాటు కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలను జోడించింది. కాబోయే భర్త వయస్సు, విద్యార్హత, ఉద్యోగం, వార్షిక ఆదాయం, అలవాట్లతో పాటు ఆయన ఆలోచనా విధానం, జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువల గురించి ప్రశ్నలు ఉంచింది. మ్యాట్రిమోనీ యాప్‌లలో ఫేక్ ప్రొఫైళ్లు, అనవసరమైన సమాచారం ఎక్కువగా ఉండటం వల్ల, తనకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా సేకరించేందుకే ఈ పద్ధతి ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది.

ఈ గూగుల్ ఫామ్ లింక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో శరవేగంగా వైరల్ అయింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 240 మందికి పైగా యువకులు ఆ ఫామ్‌ను నింపి తమ దరఖాస్తులను సమర్పించారు. ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు పోటీపడి మరీ అప్లై చేసుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

యువతి చేసిన ఈ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సమయం వృథా కాకుండా, తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవడానికి ఇదొక తెలివైన, కార్పొరేట్ తరహా మార్గం అని కొందరు నెటిజన్లు మెచ్చుకోగా..పెళ్లి అనేది పవిత్రమైన బంధం, ఉద్యోగ ఇంటర్వ్యూల తరహాలో గూగుల్ ఫామ్‌లతో సెలెక్ట్ చేయడం ఏంటి? అని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా, టెక్నాలజీని ఉపయోగించి జీవిత భాగస్వామి కోసం ఈ రకమైన జాబ్ ఇంటర్వ్యూ తరహా దరఖాస్తులు స్వీకరించడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us