
సాధారణంగా మనకు విపరీతమైన కడుపునొప్పి వచ్చిందంటే.. చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కొందరైతే నొప్పి తగ్గేందుకు తమకు తోచిన మందు వేసుకుంటారు. అయితే ఇక్కడొక యువతి.. పొరపాటున టానిక్ అనుకుని.. ఏకంగా.. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో కాజోల్ అనే 24 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఈ నెల 13వ తేదీన ఆమె భర్త రాయగడ్ వెళ్లగా.. రాత్రి 9.30 గంటల సమయంలో సదరు యువతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. టానిక్ వేసుకోవాల్సింది పోయి.. పొరపాటున పురుగుల మందు తాగేసింది. అంతే! ఒక్కసారిగా వాంతులు అవుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా తగ్గకపోవడంతో.. సాయం కోసం తల్లికి ఫోన్ చేసింది. తల్లి తన కుమారుడితో కలిసి కూతురు ఇంటికి చేరుకుంది. అక్కడ కూతురు పరిస్థితి చూసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పటికే కాజోల్ ఆరోగ్యం క్షీణించడంతో.. ఆమె కన్నుమూసింది.