వామ్మో ఏనుగు.. రోడ్డుపై బైకర్‌ను తొక్కేసిన గజరాజు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

అడవి ఏనుగు ఎదురుపడితే ఎంతటి ప్రమాదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఓ భారీ ఏనుగు ఏకంగా బైకర్‌పై రెండుసార్లు కాళ్లు వేసి తొక్కింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై జరిగిన ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వామ్మో ఏనుగు.. రోడ్డుపై బైకర్‌ను తొక్కేసిన గజరాజు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
Wild Elephant Tramples Biker

Updated on: Nov 12, 2026 | 1:10 PM

అడవి ఏనుగు ఎదురుపడితే ఎంతటి ప్రమాదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఓ భారీ ఏనుగు ఏకంగా బైకర్‌పై రెండుసార్లు కాళ్లు వేసి తొక్కింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై జరిగిన ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. గురువారం (నవంబర్ 12) తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నేపాలీ ఫామ్ సమీపంలో ఓ బైకర్ హైవేపై ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపైకి వచ్చిన అడవి ఏనుగు అతడికి ఎదురుపడింది. ఊహించని ఈ పరిణామంతో బైకర్ తప్పించుకునేలోపే ఏనుగు అతడిపై దాడి చేసింది. కిందపడిపోయిన అతడి కడుపు, ఛాతీపై ఏనుగు రెండుసార్లు కాళ్లు వేసి తొక్కింది. దీంతో అతడు ఏనుగు కాళ్ల కింద నలిగిపోయాడు. అయితే ఏనుగు అక్కడి నుంచి పక్కకు వెళ్లిన వెంటనే బైకర్ లేచి నిలబడటం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఇంతటి భయంకరమైన ప్రమాదం నుంచి అతడు ఎలా బయటపడ్డాడన్నది చర్చనీయాంశంగా మారింది. అతడికి ఎలాంటి గాయాలు అయ్యాయనే విషయంపై స్పష్టత లేదు.

ఈ ఘటనను అదే మార్గంలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ శివ శర్మ తన కెమెరాలో చిత్రీకరించారు. నవంబర్ 12న తెల్లవారుజామున 3.46 గంటలకు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. బైకర్ ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టమని శివ శర్మ వ్యాఖ్యానించారు.

కాగా, హరిద్వార్‌-డెహ్రాడూన్ హైవే రాజాజీ టైగర్ రిజర్వ్ సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో అడవి ఏనుగులు తరచూ సంచరిస్తుంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డుపై ఏనుగులు కనిపిస్తే వాహనాలను నెమ్మదిగా నిలిపి, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వన్యప్రాణుల మార్గాల్లో నిర్లక్ష్యంగా ప్రయాణిస్తే ప్రాణాలకే ప్రమాదమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us