ఒక్క పాము కూడా కనిపించని దేశం ఏదో తెలుసా..? కారణం ఏంటంటే..

|

Jun 27, 2023 | 4:11 PM

ఇంతకు ముందు ఇక్కడ పాములు ఉండేవి. కానీ, ఇక్కడ చలి ఎక్కువగా ఉండటంతో అవి చనిపోయాయి. ఇక్కడ విపరీతమైన చలి కారణంగా అప్పటి నుండి పాములు కనిపించడం లేదని నమ్ముతారు. మరో విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో కూడా పాములు లేవు. ఈ ద్వీప దేశం అనేక అడవి జంతువులకు నిలయం, కానీ ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించలేదు..

ఒక్క పాము కూడా కనిపించని దేశం ఏదో తెలుసా..? కారణం ఏంటంటే..
Snake
Follow us on

మనమందరం పాములకు భయపడతాము, ఎందుకంటే ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవిగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు ఉన్నాయి. వాటిలో చాలా రకాల పాములు అత్యంత విషపూరితమైనవి కాగా, కొన్ని చూసేందుకు భయంకరంగా కనిపించేవి కూడా ఉంటాయి. కానీ ఒక్క పాము కూడా కనిపించని దేశం గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేశం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు కదా..? అవును.. ఈ ప్రపంచంలో ఒక్క పాము కూడా లేని దేశం కూడా ఉంది. అది ఐర్లాండ్. ఐర్లాండ్‌లో చూద్దామంటే కూడా ఒక్క పాము కనిపించదు.. ఎంత వెతికినా పాము అన్న మాట వినిపించదు అంటే షాక్ అయ్యారా? పాము లేని చోటు లేదని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నిజంగా ఐర్లాండ్‌లో పాములు లేవు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.

ఐర్లాండ్‌లో పాములు ఎందుకు కనిపించవు..?

నిజానికి, ఐర్లాండ్‌లో పాములు ఉండకపోవడానికి ఒక పౌరాణిక కారణం ఉంది. ఐర్లాండ్‌లోని క్రైస్తవ మతాన్ని రక్షించడానికి, సెయింట్ పాట్రిక్ దేశం నలుమూలల నుండి పాములను ద్వీపం నుండి తీసుకెళ్లి సముద్రంలో విసిరినట్లు చెబుతారు. 40 రోజుల పాటు తినకుండా, తాగకుండా అతడు ఈ పని చేశాడని చెబుతారు. ఇక ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. ఈ దేశంలో పాములు ఎప్పుడూ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐర్లాండ్‌లో ఇప్పటి వరకు పాములు ఉన్న దాఖలాలు లేవని ఫాసిల్ రికార్డ్స్ విభాగం చెబుతోంది. ఐర్లాండ్‌లో పాములు లేకపోవడం గురించి మరొక కథ కూడా ఉంది.

ఇంతకు ముందు ఇక్కడ పాములు ఉండేవి. కానీ, ఇక్కడ చలి ఎక్కువగా ఉండటంతో అవి చనిపోయాయి. ఇక్కడ విపరీతమైన చలి కారణంగా అప్పటి నుండి పాములు కనిపించడం లేదని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

మరో విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో కూడా పాములు లేవు. ఈ ద్వీప దేశం అనేక అడవి జంతువులకు నిలయం, కానీ ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించలేదు.. ఇక్కడ బల్లులు మాత్రమే కనిపిస్తాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..