Viral: అభిమానులకు షాకిచ్చిన అంజలి, సూఫీ జంట.. వారం రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే ఇలా..

ఇండియా, పాక్‌కు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అంజలి చక్ర, సూఫీ మాలిక్‌ మధ్య ఐదేళ్ల నుంచి ప్రేమాయణం నడుస్తోంది. ఈ అందమైన అతివల ప్రేమ పురాణం.. సోషల్‌, డిజిటల్‌ మీడియాలో వైరల్‌గా మారి వైరస్‌లా వ్యాపించింది. వీళ్ల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. వీళ్ల రొమాంటిక్‌ కథలను డైలీ సోషల్‌ మీడియాలో లక్షలాదిమంది ఫ్యాన్స్‌ ఫాలో అవుతుంటారు.

Viral: అభిమానులకు షాకిచ్చిన అంజలి, సూఫీ జంట.. వారం రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే ఇలా..
Sufi And Anjali Breakup

Updated on: Mar 27, 2024 | 11:31 AM

ఇండియా, పాక్‌కు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అంజలి చక్ర, సూఫీ మాలిక్‌ మధ్య ఐదేళ్ల నుంచి ప్రేమాయణం నడుస్తోంది. ఈ అందమైన అతివల ప్రేమ పురాణం.. సోషల్‌, డిజిటల్‌ మీడియాలో వైరల్‌గా మారి వైరస్‌లా వ్యాపించింది. వీళ్ల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. వీళ్ల రొమాంటిక్‌ కథలను డైలీ సోషల్‌ మీడియాలో లక్షలాదిమంది ఫ్యాన్స్‌ ఫాలో అవుతుంటారు. ఈ ప్రేమ పక్షులు విదేశాల్లో విహార యాత్రలు, వినోద యాత్రలతో తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. కొద్ది రోజుల్లో వాళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంతో కానున్నారు. అయితే ఉరుము లేని పిడుగులా ఈ పెళ్లి కేన్సిల్ అంటూ ఓ వార్త ఆన్‌లైన్‌ సాక్షిగా గుప్పుమంది. తమ బంధం, అనుబంధం తెగిపోయిందని, కాబోయే పెళ్లి కూడా పెటాకులు అయిందని అంజలి, సూఫీలు సోషల్‌ మీడియా సాక్షిగా ప్రకటించారు.

తమ జంట విడిపోయిందంటూ వాళ్ల భారమైన మనసుతో ఫ్యాన్స్‌కు తెలిపారు. ఈ పెళ్లి పెటాకులు కావడానికి సూఫీనే కారణమంటున్నారు. దీంతో ఈ అందాల భామల పెళ్లి కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ హతాశులయ్యారు. సూఫీకి వేరే వాళ్లతో సంబంధం ఏర్పడడమే ఈ బంధం బీటలు వారడానికి కారణమని తెలుస్తోంది. రిలేషన్‌షిప్‌లో సాక్షి చీటింగ్‌కు పాల్పడింది. వేరే వ్యక్తులతో ఆమెకు అటాచ్‌మెంట్‌ పెరిగింది. సూఫీ మాలిక్‌ చేసిన పనితో తన హృదయం ముక్కలైందని అంజలి పేర్కొంది. అయితే సూఫీని తాను పల్లెత్తు మాట అననంది. అంజలిని తాను మోసం చేశానంటూ సూఫీ కూడా అంగీకరించింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..