సాధారణంగా కారుకు ఏదైనా రిపేర్ వస్తే.. మీరేం చేస్తారు.? ఎంత ఖర్చైన డబ్బులు పెట్టి మరీ బాగు చేయిస్తారు.. లేదా రిపేర్ చేయించి సెకండ్ హ్యాండ్‌లో అమ్మేయాలని చూస్తారు. అయితే ఇక్కడొక వ్యక్తి.. తన కారుకు రిపేర్లు చేసేందుకు భారీగా ఖర్చవుతుందని తెలిసి.. ఏకంగా ఆ కారునే.. ఏం చేశాడో తెలిస్తే మీరే షాకవుతారు. ఇది కాస్త పాత వీడియోనే.. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
ఇదిగో ఈ వైరల్ వీడియో చూడండి.. ఓ వ్యక్తి తాను ఎంతో ఇష్టంగా కొనుకున్న టెస్లా కారును ఎలా పేల్చేయడానికి సిద్దమయ్యాడో.? అందుకోసం ఏకంగా 30 కిలోల డైనమెట్లను వాడాడు. తాను ఎంతగానో ఇష్టపడిన టెస్లా కంపెనీ కారు కొనుక్కున్నాడు ఓ వ్యక్తి. అయితే కొద్దిరోజులు బాగానే వాడాడు. ఎందుకో బ్యాటరీ పాడైపోతే.. కొత్తది వేయాలనుకున్నాడు. దాని ధర తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. ఏకంగా 17 లక్షలకు కొత్త బ్యాటరీ వస్తుందన్న విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. అంత మొత్తానికి మరో కారే వస్తుంది కదా అనుకున్నాడు. అంత పెట్టి బ్యాటరీ కొనేకంటే.. దీన్ని తీసేయడమే ఉత్తమం అనుకుని.. ఇదిగో ఇలా 30 కిలోల డైనమెట్ల రూపంలో కారును ముక్కలు ముక్కలు చేశాడు.