Viral Video: ఓరి దేవుడా.! సమోసాలను ఇలా తయారు చేస్తారా? వీడియో చూస్తే మళ్లీ జన్మలో తినరు!

|

Jan 26, 2023 | 5:47 PM

సమోసా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఫేవరెట్ స్నాక్ ఇది. ఉద్యోగులైతే టీ టైంలో సమోసాలనే ఇష్టంగా తింటుంటారు.

Viral Video: ఓరి దేవుడా.! సమోసాలను ఇలా తయారు చేస్తారా? వీడియో చూస్తే మళ్లీ జన్మలో తినరు!
Samosa
Follow us on

సమోసా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఫేవరెట్ స్నాక్ ఇది. ఉద్యోగులైతే టీ టైంలో సమోసాలనే ఇష్టంగా తింటుంటారు. దీన్ని బట్టి చూస్తే ఈ స్నాక్‌ను ఇష్టపడని వారు చాలా తక్కువగా ఉంటారని చెప్పొచ్చు. మరి మీ సంగతేంటి.! మీకూ సమోసా అంటే ఇష్టమా.? అయితే ఈ వీడియో చూశాక ఆ అభిప్రాయాన్ని కచ్చితంగా మార్చుకుంటారు. మళ్లీ సమోసా తినాలంటే ముందుగా భయపడతారు కూడా. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో సమోసా కూరను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే.. మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం..

వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సమోసాలో పెట్టే కూర కోసం అవసరమయ్యే బంగాళదుంపలను కడుగుతున్నాడు. అయితే వాటిని చేతితో కడగట్లేదండీ..ఓ పెద్ద గిన్నెలో ఆ బంగాళదుంపలను వేసి.. వాటిని ఆ కుర్రాడు కాలితో.. పైగా చెప్పులు వేసుకుని తొక్కుతున్నాడు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. సమోసాలను చాలామంది తింటుంటారని, ఇలాంటి ఆహార పదార్ధాన్ని అపరిశుభ్రంగా తయారు చేస్తారా.? అంటూ ఫైర్ అవుతున్నారు. రోడ్డు పక్కన తయారు చేసే నూడిల్స్, పానీపూరీ, సమోసాలు ఇలానే తయారు అవుతాయని మరొకొందరు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..