Viral Video: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..

సాధారణంగా పామును దూరం నుంచి చూస్తేనే గుండె ఝల్లుమంటుంది. దెబ్బకు పరుగు పరుగున ఆమడదూరం పారిపోతాం. అలాంటిది ఒకే చోట.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు చేరితే.. ఆ దృశ్యం మన కంటపడితే.. దెబ్బకు వాటి దరిదాపుల్లో కూడా మనం ఉండము.

Viral Video: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..
Viral Video

Updated on: May 28, 2024 | 9:26 AM

సాధారణంగా పామును దూరం నుంచి చూస్తేనే గుండె ఝల్లుమంటుంది. దెబ్బకు పరుగు పరుగున ఆమడదూరం పారిపోతాం. అలాంటిది ఒకే చోట.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు చేరితే.. ఆ దృశ్యం మన కంటపడితే.. దెబ్బకు వాటి దరిదాపుల్లో కూడా మనం ఉండము. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి అస్సాంలోని నాగావోస్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లగా.. అక్కడున్న వాటర్ ట్యాంక్ పక్కన అతడికి మూడు పాముల తలలు కనిపించాయి. భయాందోళనకు గురైన ఆ వ్యక్తి.. స్థానికులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే సమీపంలోనే సంజీబ్ దేకా అనే పాములు పట్టేవాడిని పిలిచారు. అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా.. గుంపులు.. గుంపులుగా పాములు కనిపించడంతో దెబ్బకు షాకయ్యారు. కాగా, అన్నీ బురదపాములు కావడంతో అందరూ ఊరిపి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చదవండి: ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత ఆకారం.. ఆరా తీస్తే వెలుగులోకి అదిరిపోయే నిజాలు.!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us