
ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని షాకింగ్ వీడియోలు ఉండగా.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. మరికొన్నయితే ఫన్నీగా.. కడుపుబ్బా నవ్విస్తాయి. మరి అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. దొంగతనానికి కాదేది కానర్హం. ఈ సామెతను గట్టిగానే నమ్మాడు ఓ దొంగ. ఇక దాన్ని నిజం చేస్తూ.. ముఖానికి ముసుగు వేసుకుని.. ఓ షాపులోకి దూరాడు. ఆ షాపు యజమానిని బెదిరించి.. అక్కడ ఏం దొంగతనం చేశాడో తెలుసా.? ఏముంటుంది.? ఏ మొబైల్ ఫోన్లో.. లేక విలువైన వస్తువులో.. లేక డబ్బులో అయి ఉంటుందని అనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అతడు దొంగతనం చేసింది ఓ సెక్స్ డాల్. ఆశ్చర్యపోకండి.. వైరల్ వీడియో చూసేయండి.
వీడియో ప్రకారం.. ముసుగేసుకుని వచ్చిన ఓ దొంగ.. దొంగతనానికి అడ్డుగా ఉన్న గ్లాస్‌ను కర్రతో పగలగొట్టి.. షాపులోకి దూరాడు. ఇంతకీ ఆ షాపులో అతడు ఏం దొంగతనం చేశాడో.. చూస్తే.. మీరు ఆశ్చర్యపోవడంతో పాటు షాక్ కావడం కూడా పక్కా.. షాపులో నుంచి వేగంగా బయటకు పరిగెత్తుకొచ్చిన ఆ దొంగ.. ఓ అడల్ట్ బొమ్మను పట్టుకుని పరుగో.. పరుగు అంటూ లగెత్తాడు. ఎవరో వెనుక నుంచి తరుముకుని వస్తున్నట్టుగా ‘లగెత్తరో ఆజామూ’ అంటూ పరార్ అయ్యాడు.
Risking it all for a sex doll. pic.twitter.com/LURz0Wz7oq
— CCTV IDIOTS (@cctvidiots) August 30, 2023
కాగా, ఈ వీడియోను ‘CCTV Idiots’ అనే ట్విట్టర్ పేజీ నెట్టింట షేర్ చేసింది. దీనిని ఇప్పటివరకు 5.50 లక్షల మంది నెటిజన్లు చూడగా.. 489 మంది రీ-పోస్ట్ చేశారు. అలాగే 6 వేల లైకులు వచ్చిపడ్డాయి. అటు ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..