Viral Video: యూపీలో షాకింగ్ ఘటన.. ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే?

|

Jan 08, 2022 | 10:49 AM

యూపీలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు ఓ రైతు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: యూపీలో షాకింగ్ ఘటన.. ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే?
Bjp Mla Pankaj Gupta Slapped
Follow us on

యూపీలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు ఓ రైతు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ అంతలోనే ట్విస్టిచ్చారు ఆ ఎమ్మెల్యే, ఆ రైతు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చి తమదైన రీతిలో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. యూపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఘటన రాజకీయ రంగు పలుముకుంది.

ఓ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా చెంప చెళ్లుమనిపించాడు ఓ రైతు నాయకుడు. వేదికపైకెక్కిన ఆయన..అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురైయ్యారు.  ఐతే ఆ తర్వాత ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. కేవలం అభిమానంతోనే ఎమ్మెల్యేను కొట్టానంటూ సమర్థించుకున్నాడు ఆ రైతు నాయకుడు. అటు ఆ ఎమ్మెల్యే కూడా ఆయన తన తండ్రిలాంటి వాడని..గతంలోనూ ఇలాగే అభిమానం చూపించారని స్పష్టతిచ్చారు. మొత్తానికి ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాజ్‌వాది.. ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను రైతు కొట్టిన చెంపదెబ్బ ఆఎమ్మెల్యేకు కాదని.. యోగి ఆదిత్యనాథ్ సర్కారుకని విమర్శించింది. యోగీ సర్కారుపై రైతుల్లో నెలకొన్న ఆగ్రహానికి ఇది తార్కాణంగా పేర్కొన్నారు.

ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన ఓ రైతు.. వీడియో

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, రైతు

Also Read..

Telangana Inter Exams 2022: మేలో ఇంటర్మీడియేట్‌ పరీక్షలు.. ప్రణాళికలు రూపొందిస్తున్న ఇంటర్‌ బోర్డు..!

Viral Video: సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్న శనక్కాయల వ్యాపారి పాట.. అదేంటో మీరే చూసేయండి..