Viral Video: అమ్మబాబోయ్.. దూడను అమాంతం నమిలి మింగేసిన కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

భూమి మీద ఉండే వివిధ సరీసృపాలలో అనంకొండ అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పవచ్చు. ఎలాంటి క్రూర జంతువుకైనా...

Viral Video: అమ్మబాబోయ్.. దూడను అమాంతం నమిలి మింగేసిన కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
Python

Updated on: Aug 07, 2021 | 1:17 PM

సాధారణంగా పాము, అనంకొండ పేర్లు వింటే చాలు మనుషుల్లో ఏదో భయం మొదలవుతుంది. అలాంటిది వాటిని దూరం నుంచి చూస్తే ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. భూమి మీద ఉండే వివిధ సరీసృపాలలో అనంకొండ అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పవచ్చు. ఎలాంటి క్రూర జంతువుకైనా సమవుజ్జీగా నిలుస్తుంది. పెద్ద పెద్ద జంతువులను సైతం నమిలి మింగేస్తుంది. కొన్నిసార్లు మిగతా జంతువులతో పోరులో అనంకొండ ఓడిపోయినా.. అలాంటి సందర్భాలు తక్కువే. తాజాగా లేగదూడను అనకొండ నమిలి మింగేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసి మీరు కూడా షాకవుతారు.

వైరల్ వీడియో ప్రకారం, పొలం లాంటి ప్రదేశంలో ఓ కొండచిలువ నోటికి దూడ చిక్కింది. ఇంకేముంది తనకు దొరికిన ఆహారాన్ని అమాంతం నమిలి మింగేసింది. తన పదునైన పళ్ళతో దాన్ని నోటిలోకి లాక్కుంది. పాపం.! ఆ దూడ ఎంతలా తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఏమాత్రం లాభం లేకపోయింది. కొండచిలువ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. దీనికి సంబంధించిన 13 నిమిషాల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us