Video Viral: ఆవు దూడని కారులో షికారుకి తీసుకొచ్చిన అందమైన అమ్మాయి.. నెట్టింట్లో వైరల్..

Video Viral: సోషల్ మీడియా(Social Media)లో జంతువులకు సంబంధించిన ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, ఏనుగులు వంటి వాటి వీడియోలు ఎంతగా వీక్షకులను ఆకర్షిస్తాయో.. అదే విధంగా తమ మనసుకు నచ్చి మది మెచ్చిన..

Video Viral: ఆవు దూడని కారులో షికారుకి తీసుకొచ్చిన అందమైన అమ్మాయి.. నెట్టింట్లో వైరల్..
Viral Video

Updated on: Feb 11, 2022 | 1:30 PM

Video Viral: సోషల్ మీడియా(Social Media)లో జంతువులకు సంబంధించిన ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, ఏనుగులు వంటి వాటి వీడియోలు ఎంతగా వీక్షకులను ఆకర్షిస్తాయో.. అదే విధంగా తమ మనసుకు నచ్చి మది మెచ్చిన వీడియోలను కూడా అదే విధంగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆవుని హిందువులు దేవుడిగా భావించి పూజిస్తారు. ఇక ఆవు గర్భం దాలిస్తే.. డానికి సాంప్రదాయంగా సీమంతం కూడా చేస్తున్నారు. ఇక ఆవుకి దూడ పుడితే ఇప్పుడు సంబరాలను కూడా కూడా జరుపుతున్నారు. ఆ ఆవు దూడ కాలికి గజ్జెలు, మేడలో గంటలు కడతారు. అవి చెంగు చెంగు దూకుతూ.. అల్లరి చేస్తూంటే ఆది చూసి మురిసిపోయే ఎంతో మంది యజమనులున్నారు. అయితే తమకు ఎంత ఇష్టమైనా ఆవు దూడనైనా తమతో పాటు.. కారులో కూర్చోబెట్టుకుని షికారుకి తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన బహుశా బహుకొద్ది మందికి వచ్చి ఉంటుంది. తాజా ఓ బుల్లి ఆవు దూడ కారులో ఫ్రంట్ సీటులో దర్జా బెల్ట్ పెట్టుకుని కూర్చిని తన యజమానురాలితో కలిసి ప్రయాణం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఇప్పటి వరకూ తమ పెంపుడు కుక్కలను, పిల్లులను, పక్షులను తమతో పాటు కారులో కుర్చొబెట్టికుని షికారికి తిప్పే వారికీ సంబందించిన వీడియోలు చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ అందమైన యువతి.. తన కారుని స్వయంగా డ్రైవ్ చేస్తుంది.. అంతేకాదు.. తనతో పాటు ముందు సీటులో తన పెంపుడు ఆవు దూడని కుర్చోబెట్టుకుంది. దాని సేఫ్టీ కోసం దూడకి కూడా బెల్ట్ పెట్టింది. ఆ దూడ కూడా సీటులో రెండు వెనుక కాళ్ళు ముడుచుకుని ముందు కాళ్ళు సీటు కిందకు వేలాడేసి ఎంతో ఒద్దికగా కూర్చుంది. చుట్టూ పక్కల పరిశరాలను ఎంతో శ్రద్దగా చూస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ అవుతోంది.

Also Read:

Chanakya Niti: ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి ఈ లక్షణాలు కలిగి ఉండాలంటున్న చాణక్యుడు..

Follow Us