
వర్షాకాలం వచ్చదంటే చాలా గ్రామాల్లో నివసించే వారికి పాముల బెడద స్టార్ట్ అవుతుంది. పాములు నివసించే రంద్రాల్లోకి వర్షపు నీరు చేరడం కారణంగా అవి.. నివాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. తాజాగా ఇలానే ఇంట్లోకి వచ్చి ఏసీలో నక్కిన ఓ భారీ పాములు కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసింది. ఇక విషయం తెలుసుకున్న ఓ యువతి ఇంట్లోకి వచ్చిన క్షణాల్లో ఆ భారీ పామును పట్టేసింది. దీంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఊపిరిపీల్చుకుంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇంట్లోని ఏసీలో పామును గుర్తించిన కుటుంబ సభ్యులు శ్వేత అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న శ్వేత ఏసీలో నక్కిన పాములను గమనించింది. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆ భారీ పాముకు ఆమెకు చిక్కకుండా తప్పించుకు పోయింది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు.. అంత పెద్ద పామును అలవోకగా పట్టేసింది. కూసంత భయం కూడా లేకుండా చిరునవ్వుతో ఆ పాములు మెల్లగా ప్లాస్టిక్ పైపులో బంధించింది. తర్వాత దాన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేసింది.
అయితే అక్కడే ఉన్న జనమంతా శ్వేత ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతపెద్ద పామును ఆమె పట్టుకుంటున్న దృశ్యాలను ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియొ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆడ పిల్ల అయినా ధైర్యంగా ఎలా పట్టేస్తుందో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఆడ పిల్ల కాదు.. ఆడ పులి అని మరో యూజర్ కామెంట్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.