Viral Video: ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన మహిళ… కట్ చేస్తే ఉద్యోగం ఊస్ట్..

|

Sep 19, 2021 | 7:54 PM

రోజులో ఏ క్షణం ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. ఉద్యోగానికి ఇంటి నుంచి బయలుదేరిన మొదటి నుంచి తిరిగి

Viral Video: ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన మహిళ... కట్ చేస్తే ఉద్యోగం ఊస్ట్..
Viral
Follow us on

రోజులో ఏ క్షణం ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. ఉద్యోగానికి ఇంటి నుంచి బయలుదేరిన మొదటి నుంచి తిరిగి ఇంటికి చేరుకునే వరకు ఎలాంటి అడ్డంకులు.. ప్రమాదాలు ఎదురవుతాయో తెలియవు. కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పు కలుగొచ్చు. వచ్చిన పరిస్థితిని ఎదుర్కోని.. ప్రాణాలతో భయపడాలంటే.. కచ్చితంగా దైర్యం కావాల్సిందే. కానీ మనం మన పని చేసుకుంటున్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ దొంగ వచ్చి మనపై దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించడానికి కాస్త కష్టంగానే ఉంటుంది కదూ.. కానీ ఓ మహిళలకు అలాంటి పరిస్థితి ఎదురైంది. రెస్టారెంట్‏లో పనిలో ఉన్న ఆ మహిళ ఉద్యోగిపై ఓ దొంగ ఆకస్మాత్తుగా దాడి చేశాడు. దీంతో ఆమె భయపడిపోకుండా.. ధైర్యంగా ఆ దొంగకు ఎదురునిలిచి.. అతనితో దాడికి దిగి..ఎట్టకేలకు అతడిని రెస్టారెంట్ నుంచి తరిమికొట్టింది. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది.. కానీ ఆ మహిళకు ఊహించని షాకిచ్చారు ఆ రెస్టారెంట్ ఓనర్స్. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అసలేంటో పూర్తి వివరాలు తెలుసుకుందామా.

అమెరికాలోని ఇల్లినాయిస్‏లో స్థానికంగా ఉన్న సబ్వే రెస్టారెంట్‏లో అరసెలీ సోటెలో అనే మహిళ ఉద్యోగం చేస్తుంది. 2021 సెప్టెంబర్ 5న ఆ రెస్టారెంట్‏లోకి ఓ దొంగ ప్రవేశించి తుపాకీ చూపిస్తూ.. తన దగ్గర ఉన్న మనీ మొత్తం ఇవ్వమని బెదిరించాడు. దీంతో ఆ మహిళ దొంగకు ఎదురు నిలిచింది. అతనితో పోరాడింది. ఇద్దరూ పోట్లాడుకున్నారు. దీంతో అతని చేతిలో ఉన్న రివాల్వర్ కిందపడిపోవడంతో.. వెంటనే ఆమె ఆ తుపాకీ పట్టుకుని అతడిని బెదరగొట్టింది. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ట్వీట్..

అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకెముంది ఈ వీడియో చూసిన సదరు రెస్టారెంట్ ఓనర్స్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేశారు. ఇందుకు కారణం.. ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడమే. అయితే అది షేర్ చేసింది తను కాదని.. సదరు మహిళ వాదిస్తున్న రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం వినిపించుకోలేదు. ఈ విషయాన్ని ఆమె నెటిజన్లతో పంచుకోగా… ఆమెకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

Also Read:

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..