Viral Video: కొవ్వెక్కిన కోడి చికెన్ షాప్ ఎక్కి కూసినట్టుంది.. ఈగద్ద యవ్వారం.. సీన్ చూస్తే మామూలుగా ఉండదు మరి..

|

Jan 04, 2023 | 7:00 AM

ఓ కోడి ఆహారం చికెన్ షాప్‌ కి వెళ్లి తిందామని ట్రై చేస్తే ఏమవుతుంది.. ఇంకేముందు చికెన్ అయి వేరొకరు తినేందుకు రెడీ అవుతుంది.

Viral Video: కొవ్వెక్కిన కోడి చికెన్ షాప్ ఎక్కి కూసినట్టుంది.. ఈగద్ద యవ్వారం.. సీన్ చూస్తే మామూలుగా ఉండదు మరి..
Hawk
Follow us on

ఓ కోడి ఆహారం చికెన్ షాప్‌ కి వెళ్లి తిందామని ట్రై చేస్తే ఏమవుతుంది.. ఇంకేముందు చికెన్ అయి వేరొకరు తినేందుకు రెడీ అవుతుంది. అదే అక్కడికి వెళ్లకుండా ఉంటే.. ప్రాణాలతో బ్రతికిబట్టకడుతుంది. అయితే, ఓ గద్ద యవ్వారం కూడా అచ్చం ఇలాగే ఉంది. ఆహారం దొరికిందని ఆబగా ఎండ్రకాయను తినేందుకు ప్రయత్నిస్తే.. అది రివర్స్ ఇచ్చిన ట్విస్ట్‌కు గద్దకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. బతుకు జీవుడా అంటూ నానాపాట్లు పడి.. అక్కడి నుంచి ఉడాయించింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులోని సీన్స్ చూసి నెటిజన్లు సైతం బాప్‌రే అంటూ షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ గద్ద నీటి మధ్య తేలిన రాయిపై వాలింది. అక్కడ ఉన్న ఓ ఎండ్రకాయను చూసింది గద్ద. గుటుక్కున మింగేద్దామనుకుని లటుక్కున ముక్కుతో పట్టుకుంది. కానీ, ఎండ్రకాయ తానేమీ తక్కువ కాదంటూ రివర్స్ అటాక్ చేసింది. గద్ద అలా ముక్కుతో పట్టుకుందో లేదు.. ఎండ్రకాయ వెంటనే రివర్స్ అటాక్ చేసింది. తన పదునైనా కాళ్లతో దాని ముఖంపై దాడి చేసింది. ఎండ్రకాయ దెబ్బకు నీటిలో పడిన గద్ద విలవిల్లాడింది. ఎలాగోలా ఆ ఎండ్రకాయను వదిలించుకుంది. బతుకు జీవుడా అంటూ అక్కడి తుర్రున ఎగిరిపోయింది. మళ్లీ దీని జోలికి వెళ్లొద్దని భావించి పరార్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను birdsscape పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఎవరి సమస్యలకు వారే కారణం అవుతారంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..