Viral Video: కొబ్బరి బోండంపై హిట్‌మ్యాన్‌ బొమ్మ.. కళాకారుడి ప్రతిభకు రోహిత్‌శర్మ ఫ్యాన్స్‌ ఫిదా

సమాజంలో సెలబ్రెటీలకు ఉండే హవానే వేరు. ముఖ్యంగా సినీ, క్రీడాకారులకు లక్షలాది.. కాదు కాదు.. కోట్లాది అభిమానులు ఉంటారు. వారు చూపే అభిమానం వెలకట్టలేనిదిగా ఉంటుంది. సమయం దొరికినప్పుడు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక క్రికెట్‌ ఆటగాళ్లకు ఉండే క్రేజ్‌

Viral Video: కొబ్బరి బోండంపై హిట్‌మ్యాన్‌ బొమ్మ.. కళాకారుడి ప్రతిభకు రోహిత్‌శర్మ ఫ్యాన్స్‌ ఫిదా
Rohit Sharma Coconut Idole

Updated on: Jan 20, 2026 | 5:24 PM

సమాజంలో సెలబ్రెటీలకు ఉండే హవానే వేరు. ముఖ్యంగా సినీ, క్రీడాకారులకు లక్షలాది.. కాదు కాదు.. కోట్లాది అభిమానులు ఉంటారు. వారు చూపే అభిమానం వెలకట్టలేనిదిగా ఉంటుంది. సమయం దొరికినప్పుడు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక క్రికెట్‌ ఆటగాళ్లకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తమకు ఇష్టమైన క్రికెటర్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆరాదిస్తుంటారు. భారత జట్టు మాజీ కెప్టెన్‌, హిట్‌ మ్యాన్‌గా పేరొందిన రోహిత్‌శర్మకు అయితే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది.

రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా దిగి తనమార్క్ షాట్లతో భారీ సిక్సర్లు, ఫుల్‌షాట్లు కొడుతుంటే స్టేడియం ఓ రేంజ్‌లో ఊగిపోతుంటుంది. 2027 వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు తనదైన శైలిలో వ్యక్తపరిచాడు. ఓ కొబ్బరి బోండంపై టీమిండియా స్టార్ రోహిత్‌ శర్మ బొమ్మను చాలా నేర్పుగా చెక్కి అబ్బురపరిచాడు. ప్రస్తుతం ‘కోకోనట్‌ రోహిత్’ వీడియో నెట్టింట వైరలగా మారింది.

గతంలో ఒక కుర్రాడు క్యూబిక్ రూబ్స్‌తో పేసర్ మహమ్మద్ షమీ బొమ్మకు రూపమిస్తే, ఇప్పుడు రోహిత్ శర్మ అభిమాని ఒకరు కొబ్బరి బోండంపై తన కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. పొడవాటి కొబ్బరి బోండం పైభాగాన్ని తన అభిమాన క్రీడాకారుడు చిన్న కత్తితో ఎంతో నేర్పుగా.. రోహిత్ చిత్రాన్ని ఆవిష్కరించాడు. తలపై టోపీగా కొబ్బరి బోండం భాగాన్నే మలిచిన తీరు అభిమానులను అబ్బురపరుస్తోంది.

సెల్ఫ్‌లెస్ అనే ఎక్స్‌ యూజర్ పోస్ట్ చేసిన కోకోనట్‌ రోహిత్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది. కోకోనట్ రోహిత్ అపురూపమైన చిత్రాన్ని చూసిన వారంతా ఈ కుర్రాడి ప్రతిభను కొనియాడుతున్నారు. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

వీడియో చూడండి: