Viral Video: బాలీవుడ్ సినిమా డైలాగ్‌తో టాంజానియా అన్నా చెల్లెలు.. నెట్టింట్లో వీడియో వైరల్

|

May 20, 2022 | 9:44 AM

కిలీ పాల్, నీమా ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఇందులో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తొలి చిత్రం 'హీరోపంతి' లోని డైలాగ్ ను చెబుతూ కైలీ పాల్‌ కనిపించాడు.

Viral Video: బాలీవుడ్ సినిమా డైలాగ్‌తో టాంజానియా అన్నా చెల్లెలు.. నెట్టింట్లో వీడియో వైరల్
Tanzanian Kili Paul Video V
Follow us on

Viral Video: టాంజానియా(Tanzanian) తోబుట్టువులు కైలీ పాల్ (kili paul), నీమా (neema) గత కొన్ని నెలలుగా రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నారు. ఈ అన్నా చెల్లెల్లు ఇద్దరూ.. బాలీవుడ్, దక్షిణాది సినిమాలకు చెందిన సూపర్‌హిట్ పాటలు,  డైలాగ్‌లతో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.  కైలీ పాల్, నీమాలు కలిసి రకరకాల పాటలకు లిప్ సింక్ చేస్తూ కొన్నిసార్లు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. దీంతో కైలీ పాల్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకున్నాడు. వీరిలో భారతీయులు కూడా అధికంగా ఉన్నారు. కిలీ పాల్, నీమా ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఇందులో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తొలి చిత్రం ‘హీరోపంతి’ లోని డైలాగ్ ను చెబుతూ కైలీ పాల్‌ కనిపించాడు. ఈ వీడియోలోకైలీ ఛోటా బచ్చా హై క్యా చిత్రంలోని పాపులర్ డైలాగ్‌ను డిఫరెంట్ స్టైల్‌లో చెప్పడం కనిపిస్తుంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. కైలీ పాల్ తన సాంప్రదాయ మెరూన్ దుస్తులలో ఇంటి వరండాలో నేలపై కూర్చుని ఎవరితో నైనా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఉంది. అతని సోదరి నీమా పింక్ దుస్తులు, ఆభరణాలను ధరించి.. నేలను చీపురుతో తుడుస్తోంది. ఈ సమయంలో కైలీ తన సోదరిపై అకస్మాత్తుగా కోపం తెచ్చుకున్నాడు. దీని తరువాత..  భిన్నమైన శైలిలో హీరోపంతి చిత్రంలోని డైలాగ్ ను చెప్పాడు. చిన్న పిల్లవాడు ఏమిటి అంటూ.. కైలీ టైగర్ ష్రాఫ్‌ను కాపీ చేయడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లకు నచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో కైలీ పాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘లిటిల్ బేబీ హో క్యా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఒకరోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వీక్షణలు రాగా, 1 లక్షా 73 వేల మంది లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో ఈ  వీడియో భారతీయులు ప్రేమను సొంతం చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..