
ఈ వైరల్ వీడియో చూశాక రోడ్‌సైడ్ హటళ్లలో, దాబాల్లో తినాలంటేనే విరక్తి పుడుతుంది. ఒక దాబాలో వంటవాడు రోటీలను కాల్చే ముందు వాటిపై ఉమ్ముతున్నట్లు ఆ వీడియలో కనిపిస్తుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో ఈ ఘనకార్య చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో వంటవాడిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్నప్పుడు వాటిపై ఉమ్ముతూ కెమెరాకు చిక్కాడు. ఈ సంఘటన అలీగఢ్‌లోని చాంద్ ముస్లిం దాబాలో జరిగింది. 57 సెకన్ల వీడియోలో, ఆ వ్యక్తి రోటీలను తయారు చేసి, వాటిని తందూర్‌లో పెట్టే ముందు వాటిపై ఉమ్ముతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేశారు.
వైరల్ వీడియలో కనిపిస్తున్న దృశ్యాల పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడమే కాదు.. కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు చూశాక వంటవాళ్ల పట్ల నమ్మకం పోతుందని మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఎంతైనా ఇంటి ఫుడ్‌కు మించినది లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క వంటవాడివల్ల నిశ్చితార్థం మొత్తం చెడిపోయి ఉండొచ్చని కొంతమంది నెటజన్స్ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.
देखिए किस तरह से यह आदमी थूक वाली तंदूरी रोटी बना रहा है।
बेहद ही नालायक है, इसपर सख्त कार्यवाही होनी चाहिए
मामला अलीगढ़ के चांद मुस्लिम ढाबा पका है pic.twitter.com/4VRy9YTsjm
— Priya singh (@priyarajputlive) December 13, 2025