Viral Video: జల్దీ కోలుకో సామీ…స్పైడర్‌ మ్యాన్‌ హీరోకు యాక్సిడెంట్‌… షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డ టామ్‌

స్పైడర్‌ మ్యాన్‌ ఈ పేరు వింటేనే పిల్లల నుంచి వృద్దుల వరకు ఏదో శక్తి ఆవహించినంత పనైతది. ఆ మధ్య స్పైడర్‌ మ్యాన్‌ సినిమా వచ్చాక సినిమాలో మాదిరిగా అనుకరించడం ఎక్కువైపోయింది. స్పైడర్‌ మ్యాన్‌ సీక్వెన్సీ నిమాలు ఏదొచ్చినా విడువకుండా చేసే ప్రేక్షకులు...

Viral Video: జల్దీ కోలుకో సామీ...స్పైడర్‌ మ్యాన్‌ హీరోకు యాక్సిడెంట్‌... షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డ టామ్‌
Spider Man Accident

Updated on: Sep 23, 2025 | 4:41 PM

స్పైడర్‌ మ్యాన్‌ ఈ పేరు వింటేనే పిల్లల నుంచి వృద్దుల వరకు ఏదో శక్తి ఆవహించినంత పనైతది. ఆ మధ్య స్పైడర్‌ మ్యాన్‌ సినిమా వచ్చాక సినిమాలో మాదిరిగా అనుకరించడం ఎక్కువైపోయింది. స్పైడర్‌ మ్యాన్‌ సీక్వెన్సీ నిమాలు ఏదొచ్చినా విడువకుండా చేసే ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆ సినిమాకు ఉండే క్రేజ్‌ అలాంటిది. మరి స్పైడర్‌ మ్యాన్‌ లెక్కనే వేశదారణ, ఎగరడం, నడవడం వంటి పనులు చేశారు. ఇక స్పైడర్‌ మ్యాన్‌ టాయ్స్‌కు మార్కెట్‌లో ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం టామ్ హాలాండ్ హీరోగా స్పైడర్ మ్యాన్ సినిమాలు సీక్వెల్‌గా వస్తున్నాయి. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హీరో టామ్ హాలాండ్ తలకు గాయం అయినట్లు నెట్టింట్లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. గాయం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందనేది దాని సారాంశం. హార్ట్‌ఫోర్‌షైర్, వాట్‌ఫోర్డ్‌లో ఉన్న లీవెస్‌డెన్ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతుండగా టామ్ పైనుంచి కిందపడిపోవడంతో తలకు గాయం అయింది. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారట.

హీరో టామ్ ఆస్పత్రి పాలు కావటంతో స్పైడర్‌ మ్యాన్‌ సినిమా షూటింగ్‌ వాయిదా పడేయాల్సి వచ్చింది. మరికొన్ని రోజుల్లో టామ్ కోలుకోగానే మళ్లీ షూటింగ్‌ యథావిధిగా సాగుతుంది. కాగా, బ్రాండ్ న్యూడే షూటింగ్ ఆగస్టు నెలలో షురువైంది. 2026, జులై 31వ తేదీన సినిమా విడుదల చేసేందుకు ప్లాన్‌ వేశారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌ వాయిదా పడిన నేపథ్యంలో విడుదల తేదీ కూడా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వీడియో చూడండి: