Video: వణుకుపుట్టించే వీడియో.. మలుపు వద్ద కారు చూడండి ఎలా ఎగిరిపడిందో!

అతివేగంగా వెళ్తున్న బాలెనో కారు నియంత్రణ కోల్పోయి చెరువులో పడిపోయిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో కారులోని వారు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అతివేగం ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది.

Video: వణుకుపుట్టించే వీడియో.. మలుపు వద్ద కారు చూడండి ఎలా ఎగిరిపడిందో!
Car Accident Karnataka

Updated on: Sep 19, 2025 | 6:15 AM

అతి వేగం ప్రమాదకరమని ట్రాఫిక్‌ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా, ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి అతి వేగమే వారి ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ ప్రాంతం నుండి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో వేగంగా వెళ్తున్న బాలెనో కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి పడిపోయింది.

ఈ మొత్తం సంఘటనను అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. కారు చాలా వేగంగా వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక మలుపు వద్దకు చేరుకునేసరికి, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి పల్టీ కొట్టింది. కొన్ని సెకన్లలోనే కారు చెరువులో పూర్తిగా మునిగిపోయింది.

ప్రాణాలను కాపాడారు..

కారు స్కిడ్ అయి చెరువులో పడిపోయిన తీరును బట్టి చూస్తే, బ్రేక్ వేసేటప్పుడు లేదా అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని స్పష్టంగా అర్థమవుతుందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో మరొక వాహనం వచ్చి ఉంటే, లేదా పాదచారులు రోడ్డుపై ఉంటే, ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని వారిని రక్షించడానికి త్వరగా ప్రయత్నించారు. సకాలంలో కారు డోర్లు తెరవడంతో అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి