Viral Video: ఎండలకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..

|

Mar 30, 2024 | 10:39 AM

మీ పిల్లలు అడిగిన వెంటనే కూల్ డ్రింక్స్ కొనిస్తున్నారా..? అయితే జాగ్రత్త...! మీ పిల్లలు తాగుతుంది కూల్ డ్రింకా లేక చల్లని విషమో తెలుసుకోండి..? ఎందుకంటే.. కూల్‌ కూల్‌ డ్రింక్ వెనుక కాలకూట విషం దాగుంది. కవర్‌ కలర్‌ఫుల్‌గా ఉంటుంది.. ఇచ్చేప్పుడు ఫ్రిజ్‌లో నుంచే ఇస్తారు. కానీ కూల్ డ్రింక్ తయారీ ఎలా జరుగుతుందో తెలుసా? ఈ స్టోరీ చూడండి.

Viral Video: ఎండలకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..
Fake Cool Drink
Follow us on

ఏది కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఏం తాగేటట్టు లేదు ఏది అసలు? ఏది నకిలీ ? పసిగట్టలేనంతగా మార్కెట్‌లో కల్తీ సరుకు డంప్‌ అవుతోంది. బ్రాండెడ్‌ కంపనీ ప్రాడక్ట్స్‌ను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఒరిజినల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా మాయ చేస్తున్నారు. పేరుకు బ్రాండెడ్‌ బాటిలే.. కానీ అందులో నింపింది కల్తీ మాల్. నిబంధనల్లేవు… నీళ్లు లేవు.. డ్రైనేజీ కన్నా అపరిశుభ్రంగా వున్న ఏరియాలో కూల్ డ్రింక్స్ తయారీ చేస్తున్న వైనం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అవును.. అపరిశుభ్ర వాతావరణం మధ్యే కూల్ డ్రింక్స్ ఫిల్లింగ్‌ జరుగుతోంది. పది రూపాయలు తక్కువకు వస్తుంది అంటే చిరు వ్యాపారులు వాళ్ల దగ్గరే కొంటారు కాబట్టి.. అలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని ఈ దందా సాగిస్తున్నారని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తోంది. కూల్ డ్రింక్స్ సేల్ విపరీతంగా నడుస్తుంది. మండే ఎండల్లో కూల్ కూల్‌గా ఓ డ్రింక్ తాగుదాం అనుకునే ముందు అది ఒరిజినలా, కల్తీనా అని ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ఓ కంపెనీ కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లకు డ్రింక్‌ను నింపుతున్నాడు. మరో వ్యక్తి దానికి ఒరిజినల్ లేబుల్స్ వేసి సీల్ వేస్తున్నాడు. చూడటానికి అచ్చం కంపెనీ కూల్ డ్రింక్‌లా ఉండేలా తయార చేస్తున్నారు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు ఏంట్రా బాబు ఈ దరిద్రం అంటూ మండిపడుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇది మన దేశంలో కాదని ఇంకొందరు పేర్కొంటున్నారు.  ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోన్న ఇలాంటి వాళ్లపై .. చర్యలు తీసుకోవాలని నెటజన్స్ డిమాండ్ చేస్తున్నారు.