Viral Video: ఈ వీడియో చూశాక మీ పిల్లవాడు ఫోనే ముడితే ఒట్టు… స్మార్ట్‌ఫోన్‌ అడిక్ట్‌ దుష్పరిణామాలపై వినూత్న అవేర్‌నెస్‌

ప్రస్తుతం ప్రజల జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ఓ భాగమైపోయింది. ఇంకా చెప్పాలంటే శరీరంలో అదొక అవయవంలా మారిపోయింది. పిల్లల నుంచి వృద్దుల వరకు అంతా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. అయితే అవసరానికి స్మార్ట్‌ఫోన్లు వాడితే ఒకేగాని దానికి అడిక్ట్‌ అయితేనే అసలు ప్రాబ్లం అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలకు వినోదం...

Viral Video: ఈ వీడియో చూశాక మీ పిల్లవాడు ఫోనే ముడితే ఒట్టు... స్మార్ట్‌ఫోన్‌ అడిక్ట్‌ దుష్పరిణామాలపై వినూత్న అవేర్‌నెస్‌
Smart Phone Addiction Aware

Updated on: Aug 20, 2025 | 6:31 PM

ప్రస్తుతం ప్రజల జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ఓ భాగమైపోయింది. ఇంకా చెప్పాలంటే శరీరంలో అదొక అవయవంలా మారిపోయింది. పిల్లల నుంచి వృద్దుల వరకు అంతా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. అయితే అవసరానికి స్మార్ట్‌ఫోన్లు వాడితే ఒకేగాని దానికి అడిక్ట్‌ అయితేనే అసలు ప్రాబ్లం అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలకు వినోదం కోసం లేదా వారి అల్లరిని వదిలించుకోవడానికి ఫోన్‌లను ఇస్తారు. కానీ ఈ అలవాటు పిల్లల మానసిక అభివృద్ధికి చాలా హానికరం అనే విషయం తెలుసుకునే నాటికి జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోతుంది. ఎందుకంటే, స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల పిల్లల ఆలోచనా శక్తి, అవగాహన శక్తి బలహీనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒక పాఠశాల పిల్లలలో ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించింది. దీనిని అందరూ చూడాల్సిన అవసరం ఉంది. వీడియోలో స్మార్ట్‌ఫోన్‌ వల్ల కలిగే దుష్ఫలితాలు కళ్లకు కట్టినట్లు నాటకం ద్వారా చూపించడంతో పిల్లలు ఫోన్ ముట్టుకోవాలంటేనే భయపడటం మీరు చూస్తారు. ఈ వీడియో ఇప్పుటు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

వైరల్ వీడియోలో ఒక చిన్న డ్రామా చూపించబడింది. దీనిలో ఒక పిల్లవాడు ఫోన్‌కు బానిస అవుతాడు. అతను తినేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా ఎల్లప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉండేవాడు. నిరంతరం ఫోన్ చూడటం వల్ల అతని కళ్ళు నొప్పిగా మారడం ప్రారంభించాయి. ఆ తర్వాత డాక్టర్ అతని కంటికి కట్టు కట్టాల్సి వచ్చింది. ఇది చూసిన పాఠశాల పిల్లలు ఫోన్ చూడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం చేసుకున్నారు.

వీడియో చూడండి:

నాటకం ముగిసిన వెంటనే టీచర్ పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వారు భయంతో పారిపోవడం మీరు చూస్తారు. వారిలో కొందరు ఏడవడం కూడా ప్రారంభిస్తారు. పాఠశాల కార్యకలాపాలు పిల్లలపై ఎంతగా ప్రభావం చూపాయో ఇది చూపిస్తుంది. ఇప్పుడు వారు ఫోన్‌ను బొమ్మగా కాకుండా కళ్ళకు హాని కలిగించేదిగా పరిగణించడం ప్రారంభించారు.

ఈ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి కార్యకలాపాలు చేయాలని అంటున్నారు.