Viral Video: ఇసొంటివే వద్దనేది… చావుకు ఆహ్వానం ఇదేనేమో… బైకర్‌ స్టంట్‌పై నెటిజన్స్‌ ఓ రేంజ్‌లో గుస్సా

ప్రస్తుత డిజిటల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఒక్కరోజులోనే ఫేవరేట్‌ అయ్యేందుకు చాలామంది రకరకాలుగా వీడియోలు, రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉండగా మరికొన్ని డేంజరస్‌ స్టంట్స్‌ చేసినవిగా దర్శనమిస్తుంటాయి. అయితే స్టంట్స్‌ చేసే సమయంలో...

Viral Video: ఇసొంటివే వద్దనేది... చావుకు ఆహ్వానం ఇదేనేమో... బైకర్‌ స్టంట్‌పై నెటిజన్స్‌ ఓ రేంజ్‌లో గుస్సా
Biker Dangerous Stunt On Tr

Updated on: Jan 20, 2026 | 6:17 PM

ప్రస్తుత డిజిటల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఒక్కరోజులోనే ఫేవరేట్‌ అయ్యేందుకు చాలామంది రకరకాలుగా వీడియోలు, రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉండగా మరికొన్ని డేంజరస్‌ స్టంట్స్‌ చేసినవిగా దర్శనమిస్తుంటాయి. అయితే స్టంట్స్‌ చేసే సమయంలో అనుకోని ప్రమాదాల భారిన పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రీల్స్‌ పిచ్చిలో కుటుంబాలను తీరని శోఖం మిగుల్చుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియోలో ఓ యువకుడు స్వతహాగా మృత్యువును రారమ్మని ఆహ్వానించినట్లుగా ఉంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్‌ యువడికిని ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో ఓ భారీ ట్రక్ వేగంగా దూసుకెళుతోంది. ఆ సమయంలో హెల్మెట్ కూడా ధరించకుండా ఓ బైకర్ ఆ ట్రక్ సమీపానికి అంతేస్పీడ్‌గా దూసుకొచ్చాడు. అతను ట్రక్ డ్రైవర్ వద్దకు వెళ్లి అతనితో ఏదో మాట్లాడటం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత, బైక్ వేగాన్ని తగ్గించి ట్రక్ మధ్యలోకి రావడం చూడొచ్చు. తన బైక్‌ను ట్రక్ కిందకు తీసుకెళ్లిన భయంకర క్షణాలను నెటిజన్స్‌ ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు. ట్రక్ మధ్యలో బైక్‌ను నడుపుతూ చాలా ప్రమాదకర స్టంట్ చేయడం వీడియోలో కనిపిస్తుంది.

ఆ సమయంలో ట్రక్ వేగం కొంచెం పెరిగినా, తగ్గినా బైకర్ పరిస్థితి ఏంటో ఊహించడానికి కష్టంగా ఉంటుంది. యువకుడు స్టంట్ చేస్తుండగా అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. చాలామంది నెటిజన్స్‌ ఆ బైకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని మూర్ఖత్వం అంటారని, అతడు మరణాన్ని ఆహ్వానిస్తున్నాడని నెటిజన్స్‌ కామెంట్స్‌ బాక్స్‌ను నింపేశారు.

వీడియో చూడండి: