
Injunction – Woman: ఇంజక్షన్ అనగానే చాలామంది భయపడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకూ కొందరు ఇంజక్షన్‌ను చూసి పారిపోతుంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో కోవిడ్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు పలువురు భయంతో కేకలు వేస్తున్న వీడియోలను తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఫన్నీ వీడియోలు నిత్యం చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ఇంజక్షన్‌ను చూసి వ్యాక్సినేషన్ సెంటర్లో భయంతో నానా హంగామా చేసిన మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
టీకా కేంద్రంలో వ్యాక్సిన్ కోసం వచ్చిన ఓ మహిళా నానా హంగామా చేసింది. వ్యాక్సిన్ వేస్తున్న క్రమంలో గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసింది. నర్సు మహిళ వద్దకు వస్తుండగా.. నానా రచ్చ చేసింది. చివరకు ఆమెను ఆపేందుకు ఇద్దరు, ముగ్గురు కష్టపడాల్సి వచ్చింది. ఇద్దరు ఆమె చేతులు పట్టుకోగా.. మరొకరు కాళ్లు పట్టకున్నారు. దీంతో నర్సు కష్టంతో టీకా వేసింది. కాగా ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నాకు కూడా ఇంజక్షన్ అంటే భయం.. నేనూ ఇలాగే కేకలు పెడుతూ ఏడ్చేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరీ ఇంత హంగామా అవసరమా..? అంటూ మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూడండి.
వైరల్ వీడియో..
Also Read: