Viral Video: మాస్క్‌లతో ఊయల కట్టిన కారు యజమాని.. చిలుకలు ఎలా షికారు చేస్తున్నాయో మీరే చూడండి..

క‌రోనా కారణంగా మాస్కు మ‌న జీవితంలో భాగ‌మైపోయింది.మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం పట్టినా కూడా వాటిని ఇంకా వాడుతూనే ఉన్నాం. ఇలా మన జీవితంలో నిత్యకృత్యమైన మాస్క్‌లతో ఓ కారు యజమాని వినూత్న ప్రయోగం చేశాడు. త‌న పెంపుడు చిలుకల‌కు ఏకంగా మాస్కుల‌తో ఊయ‌ల క‌ట్టాడు.

Viral Video: మాస్క్‌లతో ఊయల కట్టిన కారు యజమాని.. చిలుకలు ఎలా షికారు చేస్తున్నాయో మీరే చూడండి..
Parrots

Edited By:

Updated on: Aug 27, 2022 | 8:05 AM

క‌రోనా కారణంగా మాస్కు మ‌న జీవితంలో భాగ‌మైపోయింది.మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం పట్టినా కూడా వాటిని ఇంకా వాడుతూనే ఉన్నాం. ఇలా మన జీవితంలో నిత్యకృత్యమైన మాస్క్‌లతో ఓ కారు యజమాని వినూత్న ప్రయోగం చేశాడు. త‌న పెంపుడు చిలుకల‌కు ఏకంగా మాస్కుల‌తో ఊయ‌ల క‌ట్టాడు. ఇంకేముంది కారులో వేలాడ దీసిన మాస్కులలో చిలుకలు హుషారుగా ఊయల ఊగసాగాయి.ఈ వీడియోను ‘వ్యూస్ మ్యాక్స్’ అనే యూజ‌ర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. కారు ముందు ఊయ‌ల‌లా వేలాడదీసిన మాస్కుల‌లో ప‌సుపు, తెలుపు రంగు చిలుక‌లు ఎంతో ఉత్సాహంగా ఊయల ఊగాయి. కీచుకీచుమంటూ కారులో ఎంచెక్కా షికారు చేశాయి.

‘ఆధునిక సమస్యకు ఆధునిక పరిష్కారాలు అవసరం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్‌ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లు, లవ్‌, హార్ట్‌ ఎమోజీలు వచ్చాయి. కారు యజమాని తెలివిని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. క్యూట్‌ వీడియో, లవ్లీ వీడియో అంటూ స్పందిస్తున్నారు. అయితే కారు యజమాని గురించి లేదా ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేయబడింది అనే సమాచారం మాత్రం తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us