Viral Video: పెళ్లి వేడుకలో అమ్మమ్మ డ్యాన్స్‌ అదరగొట్టేసిందిగా.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..!

Viral Video: ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో డాన్సుల సందడి బాగా పెరిగింది. పెళ్లి అంటే... కచ్చితంగా డాన్స్‌ల కోసం ప్రత్యేకించి

Viral Video: పెళ్లి వేడుకలో అమ్మమ్మ డ్యాన్స్‌ అదరగొట్టేసిందిగా.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..!
Dance

Edited By:

Updated on: Nov 20, 2021 | 7:06 PM

Viral Video: ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో డాన్సుల సందడి బాగా పెరిగింది. పెళ్లి అంటే… కచ్చితంగా డాన్స్‌ల కోసం ప్రత్యేకించి ఓ షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, జనరల్‌గా ఇలాంటి వాటిలో వధూవరులు డాన్స్ వేయడం చూస్తుంటాం. ఒక్కోసారి వరుడు సైలెంట్‌గా ఉంటే… వధువు అదిరిపోయే స్టెప్స్ వేస్తుంది. ఈసారి వీడియోలో మాత్రం వధూవరులు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఓ బామ్మ మాత్రం దుమ్మురేపింది. ఆమె డాన్స్ చూసిన వాళ్లంతా షాక్‌తో నోరెళ్లబెట్టారు. వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా అమ్మమ్మ వేసిన స్టెప్స్‌తో అందరి చూపూ తనపైనే పడేలా చేసుకుంది.

అందమైన చీర కట్టుతో.. అదిపోయే డ్యాన్స్ చేస్తోంది. తన డ్యాన్స్ అందరినీ ఎంతగా ఆకర్షిస్తుందంటే లైక్‌లు, కామెంట్స్‌తో నెటిజన్లు సైతం..ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పాడిన పాటకు తగినట్లుగా స్టెప్ బై స్టెప్ చేస్తోంది. వీడియో చివర్లో ఈ పాట ముగిసిన వెంటనే. వారితో పాటు అక్కడే ఉన్న మిగతా మహిళలంతా జత కలిశారు..అందరూ కలిసి పెళ్లి వేదికపై హంగామా సృష్టించారు.

ఈ వీడియోను ‘patrakaar_mustafa_07’ పేరుతో ఉన్న ఇన్‌స్ట్రాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. బామ్మ డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. వాహ్.. బామ్మా.. నీకు నువ్వే సాటి.. నీకు నువ్వే పోటీ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Viral Video:

Also read:

Abu Dhabi T10 League: అబుదాబిలో పరుగుల విధ్వంసం.. గేల్, స్టెర్లింగ్‌ల ధాటికి చేతులెత్తేసిన బౌలర్లు..!

‘చంద్రబాబు మాయలో పడొద్దు.. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే..’ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..