Viral Video: మెట్రో రైళ్లో మద్యం తాగుతూ, గుడ్డు తింటూ ప్రయాణం… యువకుడిపై మండిపడుతున్న నెటిజన్స్‌

మెట్రో రైళ్లు సుఖవంతమైన ప్రయాణానికే కాదు రీల్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుంటాయి. మెట్రో రైళ్లలో యువతీ, యువకులు వివిధ రకాలుగా డ్యాన్స్‌లు చేసిన వీడియోలు, లవర్స్‌ ఫన్నీ రీల్స్‌ వీడియోలు, ఫైటింగ్‌ వంటి వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు మాత్రం అంతకు మించి అన్నట్లు వ్యవహరించాడు...

Viral Video: మెట్రో రైళ్లో మద్యం తాగుతూ, గుడ్డు తింటూ ప్రయాణం... యువకుడిపై మండిపడుతున్న నెటిజన్స్‌
Alcohol Drinking In Metro

Updated on: Apr 07, 2025 | 6:37 PM

మెట్రో రైళ్లు సుఖవంతమైన ప్రయాణానికే కాదు రీల్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుంటాయి. మెట్రో రైళ్లలో యువతీ, యువకులు వివిధ రకాలుగా డ్యాన్స్‌లు చేసిన వీడియోలు, లవర్స్‌ ఫన్నీ రీల్స్‌ వీడియోలు, ఫైటింగ్‌ వంటి వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు మాత్రం అంతకు మించి అన్నట్లు వ్యవహరించాడు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు మద్యం సేవిస్తున్న షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది మాత్రమే కాదు, కొన్ని సెకన్ల తర్వాత, ఆ వ్యక్తి మెట్రోలో గుడ్డును పగలగొట్టడానికి ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. వీడియోలో, అతను డ్రింక్‌ను ఆస్వాదిస్తూ, గుడ్డు తింటున్నట్లు కనిపిస్తుంది. “ఢిల్లీ మెట్రోలో చూడటానికి మిగిలి ఉన్న ఏకైక విషయం ఇదే” అంటూ X ఖాతాలో షేర్‌ చేసిన యూజర్ కామెంట్‌ చేశారు.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం, మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకుడు రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లవచ్చు కానీ ఢిల్లీ మెట్రో లోపల ఆ పానీయం తాగడం ఖచ్చితంగా నిషేధించబడింది.

వైరల్‌ అవుతోన్న వీడియోపై నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ మెట్రోలో రీల్స్, ఫైటింగ్‌లు, లవర్స్‌ రీల్స్‌ చూశాము, కానీ ఇప్పుడు కొత్త డ్రామా ప్రారంభమైంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది ఫన్నీ విషయం కాదు, వీడియోలో కనిపించిన వ్యక్తిని అరెస్టు చేసి, భారీ జరిమానా విధించడంతో పాటు జైలుకు పంపాలి అని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

 

వీడియో చూడండి: