గుర్తుతెలియని వ్యక్తి నడుపుతున్న కారు పైకప్పుపై నుంచి పటాకులు పేలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆ కారుల నడిపిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ బల్జీత్ సింగ్ ఇచ్చిన వివరాల మేరకు బుధవారం రాత్రి నుంచి ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. చిన్న క్లిప్‌లో, హెచ్‌ఆర్ 98 ఎ 0108 రిజిస్ట్రేషన్ నంబర్ గల నలుపు రంగు ఎస్‌యూవీ పైకప్పుపై ఉంచిన పటాకులు పేలుతున్నప్పుడు అతడు నిర్లక్ష్యంగా కారు నడపడం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఘటనకు సబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గురుగ్రామ్‌లో కదులుతున్న కారు పైకప్పు నుండి పటాకులు పేలుస్తూ కెమెరాలో చిక్కుకున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గురుగ్రామ్‌లోని అత్యంత పాష్ లోకేటీలలో ఒకటైన సైబర్ సిటీ ప్రాంతంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | A video went viral on social media where some people were seen bursting firecrackers on top of a moving car’s boot near DLF Phase-III in Gurugram on Diwali (Oct 24). All three people have been arrested: Preetpal Singh, ACP Gurugram
(Source: Viral video) pic.twitter.com/UUFCytYLEy
— ANI (@ANI) October 28, 2022
బుధవారం రాత్రి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తున్న చిన్న క్లిప్‌లో, కారు నడిపిన వ్యక్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. HR 98 A 0108 రిజిస్ట్రేషన్ నంబర్ గల బ్లాక్ కలర్ SUVని నిర్లక్ష్యంగా నడుపుతూ పైగా పటాకులు కూడా పేల్చారు. కదులుతున్న కారు డోర్, పైకప్పు మీద ఉంచిన పటాకులను గాల్లోకి ఎగురవేస్తున్నాడు. కాగా, సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుండి మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందింది. అనేక మంది వినియోగదారులు స్పందిస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు సేకరించిన వీడియో ఆధారంగా డీఎల్‌ఎఫ్ ఫేజ్-3 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనలో పాల్గొన్న ముగ్గురినీ అరెస్టు చేశారు” అని ACP ప్రీత్‌పాల్ సింగ్ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..