Viral Video: పిడుగు పడుతున్న దృశ్యం ఎప్పుడైనా చూశారా..? ఇదిగో లైవ్‌ రికార్డ్‌..షాకింగ్‌ వీడియో వైరల్‌

కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆశ్చర్యకరంగా ఆ షాకింగ్ ఘటనను అతని భార్య తన కెమెరాలో బంధించింది. ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా షాక్ తినాల్సిందే.

Viral Video: పిడుగు పడుతున్న దృశ్యం ఎప్పుడైనా చూశారా..? ఇదిగో లైవ్‌ రికార్డ్‌..షాకింగ్‌ వీడియో వైరల్‌
Lightning Strikes

Updated on: Jul 08, 2022 | 8:35 AM

వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనం, పక్షుల కిలకిలారావాలు, ప్రవహించే జలపాతాల మధ్య చినుకులను ఆస్వాదించడానికి ప్రకృతి ప్రేమికులు చాలా మంది బయలుదేరుతుంటారు. అయితే, వర్షం ఎంత రొమాంటిక్ గా అనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. తరచూగా భారీ వర్షాల కారణంగా..ఆకాశం నుండి మెరుపులు, పిడుగుపాటు చూస్తుంటాం..పిడుగుపాటు కారణంగా పలుమార్లు ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. అయితే, అలాంటి మెరుపు తాకినట్లయితే ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా..? లేదుకదా.. కానీ, ఈ వీడియో చూడండి..కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆశ్చర్యకరంగా ఆ షాకింగ్ ఘటనను అతని భార్య తన కెమెరాలో బంధించింది. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.. ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఈ దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఎడ్వర్డ్ వాలెన్ అనే వ్యక్తి తన భార్య మిచెల్‌తో కలిసి వర్షాన్ని ఆస్వాదించడానికి విహారయాత్రకు వెళ్లాడు. మిచెల్ తన కెమెరాలో కుండపోత వర్షాన్ని రికార్డ్ చేసింది. సుందరమైన పరిసరాలను చూసి ఆమె మనసు పులకరించిపోయింది. ఇంతలో ఎడ్వర్డ్ ట్రక్కులో ప్రయాణిస్తున్నాడు. అప్పుడప్పుడు తన భర్త ఫోటో కూడా తీస్తుంది. ఆ సమయంలోనే ఆకాశం నుంచి మెరుపు వచ్చి నేరుగా భర్తపై పడింది. ఈ షాకింగ్ ఘటన ఆమె కెమెరాలో బంధించింది. ఈ భయానక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గాయపడిన ఎడ్వర్డ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీ అదృష్టం బాగుంది గురూ అంటూ భిన్నమైన కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us