
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని జబ్రేరాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జాతీ తన నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడంతో విద్యుత్ శాఖ అధికారుల ఇళ్లకు విద్యుత్తును నిలిపివేశారు. జర్నలిస్ట్ అజిత్ సింగ్ రాఠి ప్రకారం, నివాసితులు కరెంటు కోతలను ఎదుర్కొంటే, బాధ్యులు కూడా అంతరాయాలను అనుభవిస్తారని ఎమ్మెల్యే జాతీ అన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో Xలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది అధికారులు అనేక ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని చూడవచ్చు. విషయం ఎమ్మెల్యే దృష్టికి చేరడంతో తానే స్వయంగా రంగంలోకి దాగాడు. ఎదైనా సమస్య ఉంటే నోటీసులు ఇవ్వాలి గానీ కరెంట్ కంట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్లకు కరెంట్ కట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీరూ అనుభవించాలని ఏకంగా విద్యుత్ అధికారుల ఇళ్లకే ఆ ఎమ్మెల్యే కరెంట్ నిలిపివేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే చర్యపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ వినియోగదారులు ఎమ్మెల్యేను సమర్థిస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతుండగా మరికొంత మంది మాత్రం విమర్శలు పెడుతున్నారు.
विभाग ने क्षेत्र की बिजली काटी तो विधायक ने बिजली विभाग के अफसरों के घरों की बिजली काट दी।
हरिद्वार के झबरेड़ा से कांग्रेस विधायक वीरेंद्र जाती ने काट दिए अफसरों के बिजली आपूर्ति के कनेक्शन।
विधायक ने कहा उनकी विधानसभा में बिजली कटौती होगी तो अफसरों की भी कटेगी।@INCIndia… pic.twitter.com/fh5NQb8FaJ— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 23, 2025