సృష్టిలో ప్రతి జీవికి ఆకలి, దాహం నిద్ర తప్పనిసరి.. వీటిని తీర్చుకోవడానికి చేసే పోరాటం గురించి తరచుగా రకరకాల వీడియోలు చూస్తూనే ఉన్నాం.. చెట్టుకున్న ఆకులు మేకలకు ఆహారం అయితే.. ఆ ఆకులని తిన్న మేక మరొక జీవికి ఆహారం.. ఇదే సృష్టి ఆహార నియమం.. ఒకొక్క జీవికి ఒకొక్క ఆహారపు అలవాటు ఉంటుంది. అయితే పాములు ల్లో మాత్రం కొండ చిలువలు భిన్నం.
ఎందుకంటే పాములు విష పూరితమైనవి .. విషం లేని పాములు ఏవైనా సరే వీటి ఆహారం గుడ్లు, కోళ్లు కప్పలు వంటి చిన్న జీవులు అయితే కొండ చిలువల విషయానికి వస్తే.. ఇవి విషపూరితమైనవి కావు. అయితే ఇవి ఆకలి వేస్తే పెద్ద పెద్ద జంవుతులను మాత్రమే కాదు.. మనుషులను కూడా విందు భోజనంగా ఆరగించేస్తాయి. జంతువులనే కాదు మనుషులను కూడా సజీవంగా మింగే శక్తి ఉన్న క్రూరమైన వేటగాడు కొండచిలువ. అలాంటి కొండ చిలువ నోటికి చిక్కిన ఓ చిన్న జీవి ప్రాణం కోసం చేసిన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కొండచిలువ చెట్టుకు తోకని చుట్టుకుని కిందకు వేలాడుతోంది. చెట్టు నుండి తలకిందులుగా ఊయల ఊగుతున్నట్లు కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కొండచిలువ 12 గంటల పాటు చెట్టుకు ఇలా వేలాడుతూనే ఉంది.
వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ నోటికి పొసమ్ ఎరగా చిక్కింది. అయితే ఆ చిన్న జీవి కొండ చిలువ నోటి నుంచి తప్పించుకునేందుకు చెట్టు కిందకు దుమికే ప్రయత్నం చేసినట్లు ఉంది. దీంతో ఆ కొంచిలువ తన పళ్లను ఉపయోగించి దానిని పట్టుకుంది. చెట్టుమీద నుంచి తలకిందులుగా వెళుతూ అలా ఎరను నొక్కి పట్టింది. మొసలి పళ్లపై భారం, కిందికి ఒత్తిడి పెరగినా నోటికి చిన్న ఎరను వదులుకోలేని పరిస్థితి నెలకొంది.
ఈ వీడియోను స్టువర్ట్ మెకెంజీ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది షాకింగ్! ఒక భారీ కొండచిలువ మా ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అయితే అది తన నోటితో పొసమ్ పట్టుకొని సుమారు 12 గంటల పాటు ఇలా వేలాడుతూనే అదే స్థితిలో ఉంది. అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వార్త రాసే సమయానికి వేలాది మంది ఈ వీడియోను చూడగా వందలాది మంది రకరకాల కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..