Viral Video: కారు మీద విరిగి పడ్డ ఫైఓవర్‌ కాంక్రీట్‌ బీమ్‌… నడీరోడ్డు మీద భయానక దృశ్యం

మహానగరాల్లో ఫ్లైఓవర్ల పెచ్చులు ఎప్పుడు ఊడి ఎవరి మీద పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా వర్షం వచ్చినప్పుడు.. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినప్పుడు ఫ్లైఓవర్ల కింద ఆగుతుంటారు. అలాంటి సమయంలో పెచ్చులు ఊడిపడి మాడు పగిలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కాకపోతే ఇక్కడ ఓ కారు ధ్వంసమైంది. ఈ వీడియో...

Viral Video: కారు మీద విరిగి పడ్డ ఫైఓవర్‌ కాంక్రీట్‌ బీమ్‌... నడీరోడ్డు మీద భయానక దృశ్యం
Flyover Slab Collapse

Updated on: Apr 07, 2025 | 5:50 PM

మహానగరాల్లో ఫ్లైఓవర్ల పెచ్చులు ఎప్పుడు ఊడి ఎవరి మీద పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా వర్షం వచ్చినప్పుడు.. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినప్పుడు ఫ్లైఓవర్ల కింద ఆగుతుంటారు. అలాంటి సమయంలో పెచ్చులు ఊడిపడి మాడు పగిలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కాకపోతే ఇక్కడ ఓ కారు ధ్వంసమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఉన్నదాని ప్రకారం ఓవర్ హెడ్ ఫ్లైఓవర్ నుండి కాంక్రీట్ ముక్క కింద కదులుతున్న కారుపై పడింది. విండ్ షీల్డ్ పగలిపోయి కారు లోనికి కాంక్రీట్‌ ముక్క చొచ్చుకుపోయిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. ఈ సంఘటన ఘాట్కోపర్ లో జరిగినట్లు వైరల్‌ అవుతోన్న పోస్ట్ ప్రకారం తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది ఏ ఫ్లైఓవర్‌ అనేది మాత్రం తెలియదు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.

వీడియోలో, ఒక పోలీసు అధికారితో సహా అనేక మంది కారు పక్కన ఉన్న దృశ్యం కనిపిస్తుంది. పగిలిన కారు అద్దం నుంచి కాంక్రీట్ బీమ్ లోనికి చొచ్చుకెళ్లనట్లు కనిపిస్తోంది. డ్రైవర్ తలుపు మూసివేసి ముందుకు వస్తుంటాడు. ఒక మహిళ ధ్వంసమైన వాహనాన్ని గమనిస్తూ ఉంది. డ్రైవర్, అధికారి కారును ఫోటో తీస్తుండగా, కెమెరా పైకి కోణంలో, ఓవర్ హెడ్ బ్రిడ్జి యొక్క ఒక ప్రాంతం కాంక్రీట్ ముక్క లేకుండా బయటపడుతుంది.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఓ వ్యక్తి తన X ఖాతాలో షేర్‌ చేశారు. ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక పోలీసు పరిశీలిస్తున్నారు. ఆ కారు డ్రైవర్ కావచ్చు, ఒక వ్యక్తి కారు తలుపు మూసివేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాంక్రీట్ బీమ్ కింద ఉన్న కారుపై పడటంతో కారు అద్దం పగిలిపోయి లోనికి దూసుకెళ్లింది. ఆశ్చర్యకరంగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

ఫ్లైఓవర్‌ కింది నుంచి వెళుతున్నప్పుడు పైన కూడా ఓ కన్నేయాలని నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

 

వీడియో చూడండి: