
Viral Video: ఇంగ్లీష్(English) మాట్లాడడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. కొంత మంది స్పోకేన్ ఇంగ్లీష్‌కు వెళ్లి ఆంగ్లం నేర్చుకుంటారు. అయినా కూడా వారు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు. కానీ వృద్ధురాలు మాత్రం ఆంగ్లాన్ని అలవోకగా మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలను కాశ్మీరీ ఇంగ్లీష్ యాసలో పలికింది. సయ్యద్ స్లీత్షా అనే వ్యక్తి 30 సెకన్ల నిడివిగల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
బామ్మగారి ఇంగ్లీష్ యాసకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వీడియోను ట్విట్టర్లో 19వేల మంది చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకు ముందు ఓ బామ్మ పుష్ప సినీమాలోని సామీ సామీ పాటకు స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అయింది. ఇలా వృద్ధలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
Also Read: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..