Viral Video: వావ్‌..ఈ కుక్కను ఏమంటారో మీరే చెప్పండి… చిన్నారి పాలిట హీరోగా మారిన శునకం

మనుషులకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉండే జంతువులు ఏవని అడిగితే ఎవరైనా కుక్క అని టక్కున సమాధానం చెబుతారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత ముద్ద పెడితే చచ్చే వరకు అది విశ్వాసం చూపుతుంది. ప్రేమతో తోక ఆడిస్తూ చుట్టూ తిరుగుతుంది. ఇక పెంపుడు కుక్కలయితే చెప్పనవసరం...

Viral Video: వావ్‌..ఈ కుక్కను ఏమంటారో మీరే చెప్పండి... చిన్నారి పాలిట హీరోగా మారిన శునకం
Dog Saved Baby

Updated on: Sep 15, 2025 | 5:37 PM

మనుషులకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉండే జంతువులు ఏవని అడిగితే ఎవరైనా కుక్క అని టక్కున సమాధానం చెబుతారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత ముద్ద పెడితే చచ్చే వరకు అది విశ్వాసం చూపుతుంది. ప్రేమతో తోక ఆడిస్తూ చుట్టూ తిరుగుతుంది. ఇక పెంపుడు కుక్కలయితే చెప్పనవసరం లేదు. తమను ఎంతో ప్రేమగా సాదుకునే యజమానుల పట్ల అంతకు రెట్టింపు విశ్వాసాన్నిచూపిస్తుంటాయి. యజమానులకు తోడు నీడగా ఉంటాయి. ఆ ఇంటిలోని సభ్యులకు ఎమైనా అయితే వాటికి అయినట్లే తల్లడిల్లిపోతాయి.

కుక్కలకు విశ్వాసమే కాదు… అంతకు మించి తెలివి తేటలు కూడా ఉంటాయి. అందుకే పోలీసు, మిలట్రీ బలగాల్లో కుక్కలకు ప్రత్యేక టీమే ఉంటుంది. ఆపద కాలంలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింటిలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని కుక్క ఫాస్ట్‌గా రియాక్ట్ అయిన తీరు సోషల్‌ మీడియా జనాలను షేక్‌ చేస్తోంది. వితిన్‌ సెకన్లలో ఓ చిన్నారి ప్రాణం కాపాడింది ఆ కుక్క.

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ బట్టలు ఉతుకుతుండటం కనిపిస్తుంది. పక్కనే ఆమె బిడ్డ బేబీ కేరింగ్ ట్రాలీలో కూర్చుని ఉంటుంది. వారి పెంపుడు కుక్క కూడా అక్కడే ఓ చోట పక్కనే ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ ట్రాలీ ముందుకు కదలడం ప్రారంభిస్తుంది. ముందు ఉన్న కొలనులోకి ట్రాలీతో సహా పాప జారి పడబోతుంది. అయితే ఇక్కడో మిరాకిల్‌ జరిగింది. పక్కనే ఉన్న పెంపుడు కుక్క వెంటనే వితిన్‌ సెకండ్స్‌లో స్పందించింది. ట్రాలీ కంటే ముందు నీళ్లలో దూకి ఆ ట్రాలీ కింద పడకుండా అడ్డుకుంది. ఆ తర్వాత చిన్నారి తల్లి మేల్కొని వెనక్కి లాగింది. దీంతో ఆ చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది.

వీడియో చూడండి:

ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది లైక్‌ చేశారు. ఆ కుక్క కామన్‌సెన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారి పాలిట ఆ శునకం హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.