Viral Video: తనను పెళ్లి చేసుకోమని యువతికి ప్రపోజ్ చేస్తున్న వ్యక్తికి ఊహించని షాక్‌.. మండిపడుతున్న నెటిజన్లు..

|

Jun 07, 2022 | 12:11 PM

Viral Video: ప్రేయసికి ఓ వ్యక్తి  తనను పెళ్లి చేసుకోమని... ప్రపోజ్‌ చేస్తున్నాడు.. ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా ఆ వ్యక్తి అడిగే సరికి వండర్ ఫీల్ అయింది.. అయితే ఈ ప్రేమ జంటకు ఒక్కసారిగా ఊహించని షాక్‌ తగిలింది.

Viral Video: తనను పెళ్లి చేసుకోమని యువతికి ప్రపోజ్ చేస్తున్న వ్యక్తికి ఊహించని షాక్‌.. మండిపడుతున్న నెటిజన్లు..
Viral Video
Follow us on

Viral Video: సంప్రదాయాలు, పద్ధతులు రకరకాలుగా ఉండొచ్చు.. అయితే పెళ్లి, కుటుంబం, దాంపత్య జీవితంగురించి ప్రతి యువతీ యువకులు కలలు కంటూనే ఉంటారు. ముఖ్యంగా తాము ఇష్టపడి.. ప్రేమించిన వ్యక్తులను జీవిత భాగస్వామిగా పొందితే.. వారి సంతోషం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక  తాను ఇష్టపడిని అమ్మాయి ముందు తన ప్రేమను వ్యక్తం చేయడం ఓ మధురానుభూతి.అయితే.. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకునే క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా… ఉండాలని భావిస్తారు ప్రేమికులు. అందుకు తమదైనశైలిలో ప్రయత్నిస్తుంటారు.  ప్రేయసికి ఓ వ్యక్తి  తనను పెళ్లి చేసుకోమని… ప్రపోజ్‌ చేస్తున్నాడు.. ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా ఆ వ్యక్తి అడిగే సరికి వండర్ ఫీల్ అయింది.. అయితే ఈ ప్రేమ జంటకు ఒక్కసారిగా ఊహించని షాక్‌ తగిలింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. విరాల్లోకి వెళ్తే…

ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరం ప్యారిస్‌లోని డిస్నీల్యాండ్‌లో ఓ వ్యక్తి తన ప్రేయసిని తన జీవిత భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టమని కోరుతూ మ్యారేజ్ ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు. అందుకు డిస్నీల్యాండ్‌లో చాలా ప్రముఖమైన స్లీపింగ్ బ్యూటీ కోట ముందు నిలబడి తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యాడు. అందుకు అక్కడ పనిచేసే వ్యక్తినుంచి పర్మిషన్‌ కూడా తీసుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి ఆ కోట ముందు ఉన్న వేదికపైకి చేరుకున్నాడు. సరిగ్గా అతను తన ప్రియురాలికి ప్రపోజ్ చేసే సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చాడో మరో ఉద్యోగి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అతని చేతిలోని ఉంగరం బాక్సు లాగేసుకున్నాడు. ఆ వేదిక మీద ఎవరూ ఉండకూడదని, వేవికపైనుంచి ఇద్దరినీ కిందకు దింపేశాడు. తన జీవితంలో మధురమైన ఘట్టంగా మిగిలిపోవానుకున్న క్షణం ఇలా చేజారిపోవడంతో ఆ యువకుడు నీరుగారిపోయాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. సదరు ఉద్యోగిపై మండిపడుతున్నారు. ‘‘నీ చెత్త రూల్స్ కోసం అలాంటి మధురక్షణాలను చెడగొడతావా?’’ అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై డిస్నీల్యాండ్ యాజమాన్యం కూడా స్పందించింది. సదరు జంటకు క్షమాపణలు చెప్పామని, ఇలా జరిగినందుకు తాము చాలా బాధపడుతున్నామని, ఆ జంటకు సంతృప్తి కలిగేలా చూస్తామని తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..